కరోనా వైరస్: ఇలాగైనా, అలాగైనా.. మీడియాతో చచ్చేంత కష్టం.!

Covid 19, Irresponsible News Stories In Telugu Media

Covid 19, Irresponsible News Stories In Telugu Media

కరోనా వైరస్ (కోవిడ్ 19) వస్తే ఏమవుతుంది.? అన్నదానిపై ఇప్పటికీ జనంలో సందేహాలు అలాగే వున్నాయి. చాలామందిలో కరోనా వైరస్ వచ్చాక పెద్దగా లక్షణాలు కన్పించడంలేదు. వీళ్ళే సూపర్ స్ప్రెడర్స్ అవుతున్నారని మొదట్లో వైద్య వర్గాలు అంచనా వేశాయి.

కరోనా లక్షణాలు లేనివారు కరోనా వుందని తేలితే, ఇంట్లోనే వుండాలని.. ఇతరులకు దూరంగా వుండాలనీ వైద్యులు చెప్పారు. అలా చాలామంది కరోనా వచ్చినా, ఆ తర్వాత కరోనా నెగెటివ్ అయ్యారు. మంచిదే కదా.. ఇలాగైతే.. అని చాలామంది అనుకున్నారు. కానీ, అదంత తేలికైన విషయం కాదట. కరోనా లక్షణాలు పెద్దగా లేని కరోనా బాధితులు.. ఎక్కువకాలం ‘కరోనా వైరస్’ని ఎక్కువకాలం తమలో కలిగి వుంటారంటూ ఓ అధ్యయనం వెల్లడించిందట. ఇదెలా సాధ్యం.? అదే నిజమైతే, ఆ వైరస్.. ఇతరులకు తేలిగ్గా సోకుతుంది కదా.? ఈ అంశాలపై మళ్ళీ ఆ అధ్యయనం ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

అసలు ఏ అధ్యయనం అలా చెప్పిందోగానీ, మన తెలుగు మీడియా.. కరోనా లక్షణాల్లేకుండా కరోనా వచ్చి పోయినవారిని ఇప్పుడు తీరిగ్గా మానసికంగా చంపేసే పని పెట్టుకున్నట్టుంది. కరోనా సోకి, తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి.. జీవితాంతం సమస్యలుంటాయని ఓ పక్క వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి ఎక్కువ రోజులు బాధపడితే, ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక కూడా కొంత కాలం ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవాల్సి రావొచ్చు.

కళ్ళ ముందు కనిపిస్తున్నదేంటో, కనిపించనిదేంటో.. అసలు కరోనా వైరస్ ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కరోనా వైరస్ కంటే, మన మీడియాలో.. ముఖ్యంగా మన తెలుగు మీడియాలో వచ్చే కథనాలే ఎక్కువమందిని అనారోగ్యం పాలు చేస్తున్నాయనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.