Covid 19 variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. అప్రమత్తమైన అధికారులు?

Covid 19 variant: కరోనా వైరస్ ఈ పేరు వినగానే ఏదో తెలియని అలజడి మొదలవుతుంది కంటికి కనిపించని ఒక వైరస్ కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా ఈ కరోనా ప్రభావం నుంచి పూర్తిగా మనుషులు బయటపడకుండానే సరికొత్త వేరియంట్ల రూపంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది.తాజాగా కేపీ.3 అనే కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొద్ది వారాలుగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

జపాన్‌లో ఈ వేరియంట్‌ వేగంగా సంక్రమణ కేసులు పెరిగుతున్నాయి.జపాన్‌లో కోవిడ్ 11 వ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. గత నెలలో జపాన్‌ తోపాటు అమెరికాలో కూడా కరోనా వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి అయితే ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉంది. ఇలాంటి తరుణంలో ఈ వైరస్ బారిన పడినవారు ఎవరైనా ఇండియాలోకి ప్రవేశిస్తూ తప్పనిసరిగా ఈ వైరస్ ఇండియాలో కూడా వ్యాప్తి చెంది అవకాశాలు ఉన్నాయి కనుక అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు.

ఈ వేరియంట్ కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి కూడా సోకుతోంది. KP వేరియంట్ 3 లక్షణాలు మునుపటి వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి. అధిక తలనొప్పి, జ్వరం, రుచి తెలియకపోవడం ,వాసనను గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. ఇక గొంతు నొప్పి కూడా ప్రధాన లక్షణంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ వైరస్ అమెరికాలో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుంది.ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరిస్తూ తగు చర్యలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.