గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష ఇచ్చిన కోర్టు..

అదేంటి గొర్రెకు శిక్ష ఇవ్వటం ఏంటి అని అనుకుంటున్నారా.. ఇది నిజంగా ఓ దేశంలో జరిగిన సంఘటన. దక్షిణ సూడాన్ లోని రుంబెక్ ఈస్ట్ లో అకుయెల్ యోల్ అని ప్రదేశంలో ఒక గొర్రె మహిళను చంపేసింది. ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్ లో 40 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై గొర్రె పిల్ల దాడి చేసింది.

ఆ గొర్రె పిల్ల ఆమె తలపై పదేపదే కొట్టడంతో ఆమె పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి మరణించింది. దీంతో ఆ గొర్రె పిల్లకు మూడేళ్లు జైలు శిక్ష విధించారు. ఆ గొర్రె పిల్ల యజమాని నిర్దోషి అని.. మరణానికి కారణం ఆ గొర్రె కాబట్టి దానికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఇక గొర్రె యజమాని బాధితురాలి కుటుంబానికి 5 పశువులను పరిహారం కింద ఇవ్వాలి అని.. అంతేకాకుండా ఆ గొర్రె పిల్ల మూడేళ్ల శిక్ష తర్వాత దానిని కూడా ఆ బాధిత కుటుంబానికి ఇవ్వాలి అని తీర్పునిచ్చింది.