CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కు తాజాగా కోర్టు నుండి విచారణకు రావాలని ఆదేశం వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. 2014లో తెలంగాణ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న సమయంలో.. హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగటంతో ఆ మధ్య పలు ఆరోపణలు ఎదురయ్యాయి.
దీంతో ఈ విషయం గురించి ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ జరపడం మొదలు పెట్టింది. ఇక తాజాగా ఈ విషయం మరోసారి వెలుగులోకి రావడంతో హైదరాబాద్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వైయస్ జగన్ను విచారణకు రావాలని ఆదేశం జారీ చేసింది.