Hero Vishal : తమిళ, తెలుగు నటుడు విశాల్ మంచి గుర్తింపు పొంది ఎనర్జిటిక్ హీరోగా నిలిచాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈయనకు వ్యక్తిగతంగా మంచి గౌరవం కూడా ఉంది. అలాంటిది అతడికి మద్రాస్ హైకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది.
గతంలో విశాల్ లైకా సంస్థ నుంచి కొన్ని ఒప్పందాల ప్రకారంతో రూ.21.29 కోట్లను అప్పుగా తీసుకున్నాడని తెలిసింది. ఇక అతడు తన అప్పును తీర్చకుండా ‘వీరమే వాగై సుడుం’ అనే సినిమాను విడుదల చేయడానికి.. శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయానికి సిద్ధమయ్యాడని తెలియటంతో వెంటనే వాటిని నిషేధించాలని లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మద్రాసు హైకోర్టు ఆ సంస్థకు రూ.15 కోట్లు మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.