CM Jagan’s Delhi Tour : సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఎపెక్ట్: ఏపీకి 3 వేల కోట్లు అప్పు.!

CM Jagan’s Delhi Tour : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు.. రాష్ట్రం అదనంగా సుమారు మూడు వేల కోట్ల దాకా కొత్త అప్పు చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదండీ వరస.! తప్పదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల మీదనే నడవాలి. ఇది కేవలం వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న తప్పిదమే కాదు, అంతకు ముందు చంద్రబాబు సర్కారు చేసిన పాపం కూడా. ఆ మాటకొస్తే, విభజన ద్వారా వచ్చిన కష్టమిది.

చంద్రబాబు తనవంతుగా అప్పుల కుప్పని పెంచేస్తే, అంతకు మించి వైఎస్ జగన్ ఆ అప్పుల కుప్పని అతి తక్కువ కాలంలోనే రెట్టింపు చేసేశారంటూ ప్రతిరోజూ వార్తలు వింటున్నాం. తెలంగాణకేమో కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయ్.

పెద్ద పెద్ద కంపెనీలు కూడా తెలంగాణకు వస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం అప్పులు వస్తున్నాయ్. అంతే తేడా.

కానీ, ఈ అప్పుల భారాన్ని రాష్ట్రం మోసేదెలా.? అప్పులు పెరగడమేనా.? అభివృద్ధి జరిగేదేమన్నా వుందా.? విపక్షాలు విమర్శిస్తోంటే, ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. అప్పులతో రాష్ట్రాన్ని తాము ముంచేస్తున్నామేమో ప్రశ్నించుకోవాలి.

అది మానేసి, విపక్షాల మీద విమర్శలు చేయడంతోనే సరిపెడితే ఎలా.?

వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు జరుగుతున్నాయ్.. కానీ, రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి అనే మాటే లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, జనం ముందుకు వెళ్ళి ఏం చెప్పి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓట్లు అడగగలుగుతుంది.?