మెగాస్టార్ చిరంజీవికి నెల్లూరులో ఎంతో అనుబంధం ఉంది. చిరు కొన్నాళ్లపాటు నెల్లూరులో నివాసమున్నారు. నాగబాబు, పవన్ చదువులు కొంత అక్కడే సాగాయి. అందుకే పుట్టిన ఊరు తర్వాత నెల్లూరే తన సొంత అంటుంటారు చిరు. నెల్లూరు ప్రజలకు కూడ చిరు అంటే చాలా పర్సనల్. ఇంట్లో వ్యక్తే అనుకుంటుంటారు. ఇక చిరు సినిమాలకు నెల్లూరులో కొన్ని పర్టిక్యులర్ థియేటర్లు పెట్టింది పేరు. ఆ థియేటర్లలో చిరు సినిమా పడాల్సిందే. అలాంటి వాటిలో అర్చన థియేటర్ ఒకటి.
చిరు సినిమాలు చాలా వరకు ఆ థియేటర్లో 100 రోజులు ఆడాయి. అభిమానులు పనిగట్టుకుని మరీ రికార్డ్స్ కోసం 100, 125 డేస్ ఆడించిన సినిమాలున్నాయి. ఇప్పటికీ అర్చన అంటే చిరంజీవి సినిమాలే గుర్తొస్తాయి. చిరు అభిమానులకు ఆ సినిమా హాలులో చాలా జ్ఞాపకాలే ఉంటాయి. అలాంటి థియేటర్ ఇప్పుడు లేదు. నిన్ననే కూల్చివేశారు. ఈమధ్యనే రెనువేట్ చేసినా కూడ మళ్ళీ కూల్చేశారు. త్వరలో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుందని అంటున్నారు. ఎంత డెవలప్ అయినా, కొత్తగా మల్టీప్లెక్స్ వచ్చినా అర్చన థియేటర్ లేదనే విషయం మాత్రం ఒకింత భాధాకరమేనని, ఈ థియేటర్ తో చిరుకు పర్సనల్ రిలేషన్ ఉందని డిసప్పాయింట్ అవుతున్నారు మెగా అభిమానులు.