Chiranjeevi’s Brain Wash : టీడీపీ వైపు చూడొద్దని పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి సూచన.!

Chiranjeevi’s Brain Wash :  మెగాస్టార్ చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి తెలుగునాట అధికారంలోకి రావాలని అప్పట్లో చిరంజీవి అనుకున్నారుగానీ, ఆయన ఆలోచలకు బిన్నంగా ఎన్నికల్లో రిజల్ట్ వచ్చింది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళారు చిరంజీవి.

రాజకీయాల్లో ఎలా వుండాలో, ఎలా వుండకూడదో తెలుసుకున్నాగానీ, చిరంజీవి రాజకీయాల వైపు మల్ళీ చూడలేదు. అయితే, ఆ రాజకీయ అనుభవంతో తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి మెగాస్టార్ చిరంజీవి కొన్ని సలహాలు ఇచ్చారట.

‘సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే మన బలమేంటో తెలుస్తుంది. గతంలో బీఎస్పీతో కలిసి వెళ్ళడం చారిత్రక తప్పిదం. వామపక్షాల్ని నమ్ముకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం వుండదు..’ అని చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కి సూచించారట.

బీజేపీతో కలిసి నడవడం వల్ల కూడా ప్రయోజనం వుండదని చిరంజీవి, తన సోదరుడికి బ్రెయిన్ వాష్ చేశారట.

ఇందులో నిజమెంతోగానీ, పవన్ మాత్రం బీజేపీతో కలిసి రాజకీయాల్లో నడుస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్ళడం కూడా దాదాపు ఖాయమే. ఇలా చేయడం వల్ల ఆయా పార్టీలు బాగు పడతాయేమోగానీ, జనసేన పార్టీకి అదనపు ప్రయోజనమేమీ వుండదు.

2014 ఎన్నికల్లోనే జనసేన పోటీ చేసి వుంటే, ఈ రోజు జనసేన పార్టీ పరిస్థితి ఇంకోలా వుండేది. ఇదిలా వుంటే, చిరంజీవి అసలు తన తమ్ముడికి రాజకీయంగా ఎలాంటి సాయం చేయబోరనీ, రాజకీయాల జోలికే చిరంజీవి వెళ్ళరనీ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది.