తనకు తెలియకుండానే జగన్‌కు బంగారం లాంటి మేలు చేసిన చంద్రబాబు !

తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడన్న చందంగా ఉండి చంద్రబాబు నాయుడు పరిస్థితి.  ప్రతిపక్ష నేతగా ఆయన చేస్తున్న పనులు టీడీపీకి బెనిఫిట్ అవ్వాల్సింది పోయి జగన్‌కు పేరు తీసుకొస్తున్నాయి.  ప్రత్యర్థుల బలహీనతల మీద దెబ్బకొట్టి ప్రయోజనం పొందడం చంద్రబాబు స్టైల్ అయితే తన మీద పడిన ఆరోపణలను, తన కష్టాలను సానుభూతిగా మలచుకోవడం వైఎస్ జగన్ పద్దతి.  ఆ సానుభూతి ఫ్యాక్టర్ వలనే జగన్ సీఎం అయ్యారు.  ప్రతిపక్షంలో ఉండగా జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అందరూ తనను ఒంటరిని చేసి టార్గెట్ చేస్తున్నారనే భావనను జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగటం వలనే జగన్ బంపర్ మెజారిటీ సాధించారు.  అపొజిషన్లో ఉండగా ఈ ఫార్ములా వర్కవుట్ అయిందంటే అర్థముంది.  కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడ సానుభూతి పొందుతున్నారంటే విశేషమే అనాలి. 

Chandrababu helping YS Jagan to gain sympathy 
Chandrababu helping YS Jagan to gain sympathy 

ఈ విశేషానికి కారణం మరెవరో కాదు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.  తమ నేతలు వరుసగా ఆరెస్ట్ అవుతున్నా జనంలో జాలిని పొందడంలో విఫలమైన బాబుగారు జగన్‌ మీద జనం జాలిపడేలా చేస్తున్నారు.  రాజ్యాంగానికి, చట్టాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో పక్కనపెడితే జగన్ ప్రజలు ఇష్టపడేలా కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.  పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులు.. ఇలా జనాన్ని ఆకర్షించే డేసిషన్స్ జగన్ తీసుకున్నారు.  అవన్నీ అమలైతే బాగుంటుందని జనం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

If Jagan Goes Soft, Naidu Will Swallow Him!
కానీ జగన్‌కు మొకాలడ్డటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్షం వాటన్నింటినీ అడ్డుకుంటోంది.  అది కూడ కోర్టుల ద్వారా.  సరైన లాజిక్స్ పట్టి అమరావతి భూములను ఎలా పంచుతారు, అసలు తెలుగు మెడియమే లేకుండా చేస్తే ఎలా, మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేస్తే భూములిచ్చిన రైతులు అన్యాయం అయిపోతారు అంటూ అన్నిటి మీదా స్టే తీసుకొచ్చింది.  సరిగ్గా ఆలోచిస్తే కోర్టులు స్టేలు ఇవ్వడంలో లాజిక్ ఉంది.  కానీ జగన్ బృందం తాము మంచి చేద్దాం అనుకుంటే చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుపడుతునాడు, ఆయనే ఆపకపోయి ఉంటే ఈపాటికి అందరికీ ఉచిత ఇళ్ల పట్గాలు ఇచ్చేసే వాళ్లం, ఇంగ్లీష్ మీడియం తెచ్చేసేవాళ్లం, విశాఖలో పాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు వచ్చేసేవి అంటూ నిష్టూరపోతున్నారు.  అది చూసిన జనమంతా బాబే అడ్డు లేకపోతే ఈపాటికి జగన్ మాకు ఎంతో చేసేవాడు.  బాబు మూలాన చేయలేకున్నాడు.. పాపం అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు.  ఇది జగన్‌కు బోలెడంత సానుభూతిని తెచ్చిపెడుతోంద