BJP’s Master Plan : పవన్ కళ్యాణ్‌ని అయోమయంలో పడేసిన బీజేపీ.!

BJP’s Master Plan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వుండడానికి ఒప్పుకుంటే, తెలుగుదేశం పార్టీతో కలవడానికి సిద్ధమేనంటూ సంచలన ప్రతిపాదన తెరపైకి తెచ్చింది ఏపీ బీజేపీ. నిజానికి, ఇదొక పెను సంచలనం. టీడీపీ అంటే బీజేపీకి గిట్టదు. బీజేపీ ప్లస్ జనసేన.. ఇప్పుడు రాజకీయంగా ముందడుగు వేస్తున్నాయి.

అయితే, తెరవెనుకాల టీడీపీ కనుసన్నల్లోనే బీజేపీ, జనసేన పని చేస్తున్నాయన్న విమర్శలు వైసీపీ నుంచి దూసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తెలివిగా బంతిని టీడీపీ కోర్టులోకి నెట్టేసింది. సో, ఇప్పుడు తేల్చుకోవాల్సింది టీడీపీనే.

2024 ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనీ, విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వైసీపీని ఎదుర్కోవాలని ఇటీవల పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దానర్థం జనసేన, టీడీపీతో కలిసిపోతుందనే.. అంటూ దీర్ఘాలు తీశారు చాలామంది. ఈ విశ్లేషణలో కొంత వాస్తవం లేకపోలేదు కూడా.

అయితే, తెలిసో తెలియకో బీజేపీ ఓ మంచి పని చేసింది జనసేనకి. జనసేనాని ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే బీజేపీ – టీడీపీ – జనసేన కూటమికి తాము ఓకే.. అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. సో, ఇప్పుడు చంద్రబాబు ఆ కూటమికి అంగీకారం తెలపాలంటే, తాను ముఖ్యమంత్రి రేసులోంచి తప్పుకోవాలి. కానీ, చంద్రబాబు అలా చేస్తారా.?

రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయాల్ని బట్టి చూస్తే, చంద్రబాబుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం అంగీకరించే పరిస్థితి లేదు. సో, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి.. అన్నదానికి ఎక్కువ ఓటింగ్ పడే అవకాశం వుంది.. విపక్షాల పరంగా చూస్తే. కానీ, జనసేనాని ఆ తర్వాత జరిగే రాజకీయాల్ని తట్టుకోగలరా.? చంద్రబాబు వెన్నపోట్లకు నిలబడగలరా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.