Bheemla Nayak : ఇపుడు టాలీవుడ్ సహా సౌత్ ఇండియన్ సినిమా మరియు హిందీ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ చిత్రం “భీమ్లా నాయక్”. గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు రానా లు హీరోలుగా నటించిన ఈ భారీ సినిమా అనుకోని రీతిలో ఈ నెలలోనే రిలీజ్ సిద్ధం చెయ్యడంతో ఒక్కసారిగా హైప్ వేరే లెవెల్ లోకి వెళ్ళిపోయింది.
అలాగే ఈ సినిమాకి గాను పవన్ ఒక్కడి పేరు పైనే భారీ స్థాయి బిజినెస్ జరుగుతుంది అని ఇండస్ట్రీ వర్గాలు ఇది వరకే చెబుతున్న సంగతి తెలిసిందే. మరి అది ఏ లెవెల్లో ఉందో ఇప్పుడు బిజినెస్ వివరాలు తెలుస్తున్నాయి. ఈ సినిమా టోటల్ గా అయితే ఊహించని లెవెల్లో ఏకంగా 180 – 190 కోట్లకి పైగా అన్ని హక్కులు కలగలిపి చేసినట్టు తెలుస్తుంది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 100 కోట్లు బిజినెస్ ని టచ్ చేసిందట. అంతే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కులుగా సాటిలైట్ మరియు ఓటిటి హక్కులు మాత్రమే రికార్డు స్థాయి 75 కోట్లు పలికినట్టు తెలుస్తుంది. ఇంకా కన్నడ, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్, ఆడియో హక్కులు కలిపి ఈ చిత్రం ఇంకో 30 కోట్ల మేర చేసినట్టుగా ఇన్సైడ్ టాక్.
పవన్ కం బ్యాక్ అంటూ వచ్చిన “వకీల్ సాబ్” కి కూడా ఈ రేంజ్ లో బిజినెస్ జరగలేదు. అలాంటిది భీమ్లా నాయక్ కి అయ్యింది. దీని బట్టి మాస్ సినిమా మాస్ సినిమానే అని చెప్పాలి. ఇక ఈ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించగా నాగవంశి నిర్మాణం వహించారు
