గురక, ఆప్నియా రెండూ ఒక్కటి కాదా…. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్న సమస్యలలో గురక సమస్య ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిద్రలో గురక పెట్టేవారు బాగా నిద్ర పోవడం వల్ల గురక పెడుతున్నట్టు కాదు వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మాత్రమే ఇలా గురక వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులు స్లీప్ అప్నియా అనే వ్యాధి వల్ల మరణించడం చూశాం. కొంత మంది గురక ఇంకా స్లీప్ అప్నియా రెండు ఒకటే అంటుంటే మరికొందరు అవి రెండూ వేరు అని వాదిస్తున్నారు. వీటి గురించి ఇక్కడ తెలుసుకుందాం…

మనిషి నిద్ర పోయినప్పుడు శరీరంలోని కండరాలు అన్నీ రిలాక్స్ అవుతాయి. గొంతు కండరాలు కూడా వదులవుతాయి. దీని వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఈ పరిస్థితి కొద్దిసేపు ఉంటే దీనిని హైపాప్నియ, అని పది సెకన్ల కంటే ఎక్కువగా ఉంటే ఆప్నియా అని అంటారు. దీనివలన ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా అవ్వకపోవడం వల్ల శరీరంలో కార్బన్డయాక్సైడ్ శాతం ఎక్కువై ప్రాణాపాయ స్థితికి చేరే అవకాశం ఉంది. దీనినే ఆప్నియా అని కూడా పిలుస్తారు

నిద్రలో గొంతులో ఉన్న కండరాలు వేలాడడం వల్ల శ్వాసనాళం చిన్నది గా మారి గాలి తీసుకున్నప్పుడు, వదిలినప్పుడు గురక శబ్దం వస్తుంది. శ్వాస నాళంలో గాలి వెళ్లేటప్పుడు అది అంగిలికి తగిలి శబ్దం వస్తుంది. దీనినే గురక అని అంటాము. అయితే గురక ఆప్నియా రెండు కూడా ఒకటి కాదు. ఆప్నియా ఉన్న వారికి ఖచ్చితంగా గురక ఉంటుంది. కానీ గురక ఉన్న ప్రతి ఒక్కరికి ఆప్నియా సమస్య ఉండదు. గురక అనేది శ్వాసనాళాలు చిన్నగా అయిన కూడా శ్వాస సంబంధిత సమస్య రాదు. ఆప్నియా సమస్యతో బాధపడేవారిలో పూర్తిగా ఆక్సిజన్ అందక రక్తపోటు పెరిగి గుండెకు, మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. స్లీప్ అప్నియా సమస్యతో బాధపడేవారు మృతి చెందే అవకాశం కూడా ఉంది.