నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండా పెట్టే గురక శబ్దం ఎదుటివారిలో తీవ్ర అసహనం,చికాకు తెప్పించి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. మనం గురక పెట్టడం వల్ల మనకి ఇబ్బంది లేదు ఎదుటి వారే కదా ఇబ్బంది పడేది అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే మీలో గురకపెట్టే లక్షణాలు కనిపిస్తుంటే భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎదుర్కొక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కావున ఇప్పటికైనా మేల్కొని గురకను తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెడితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్రలో గురక పెట్టే వ్యాధిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలో గురక పెట్టడాన్ని తగ్గించుకోవాలంటే మొదట గురక రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటే సులువుగా గురక సమస్య నుంచి బయటపడవచ్చు.ముఖ్యంగా ఊబకాయం అధిక బరువు ఉన్న వారికి గురక వచ్చే ప్రమాదం ఎక్కువే అని చెప్పొచ్చు. కావున మొదట ఉబకాయం బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే గురక పెట్టే తీవ్ర సమస్య తగ్గుముఖం పడుతుంది. మీ శరీర బరువును తగ్గించుకోవాలంటే రోజువారి ఆహారంలో అత్యధిక కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు, కొవ్వు పదార్థాలు కలిగిన ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే మంచిది.
గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే పొగ తాగడం,మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లకు బానిసగా మారితే గురక వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కావున తక్షణమే ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉంటే గురక సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో గుండెపోటు ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చు.ప్రతి రోజు యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మౌత్ ఎక్సర్ సైజులు చేయడం కూడా మంచిదే. మనం పడుకునే దిశ కూడా మార్చుకోవాలి. వెల్లకిలా పడుకుంటే గురక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గురక రాకుండా ఉంటుంది. ప్రతిరోజు కొంత శారీరక శ్రమ కలిగిన నడక, రన్నింగ్, సైకిల్, స్విమ్మింగ్ వంటివి అలవాటు చేసుకుంటే గురక సమస్యకు సులువుగా పెట్టవచ్చు.