రాత్రి గురక వల్ల ఇబ్బందులు పడుతున్నారా. ఈ సమస్యలకు చెక్ పెట్టే చిట్కాలివే!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో గురక వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గురక సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. స్లీప్ యాప్నియా అనే రుగ్మత కూడా గురకకు కారణమవుతుందని చెప్పవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

గొంతులో గాలి ప్రయాణించే మార్గం కుంచించుకుపోతే గురక వచ్చే అవకాశం ఉంటుంది. గాలి వెళ్లే వాహికలు కుంచించుకుపోయిన సందర్భాల్లో కండరాలు గాలికి అడ్డం పడి ప్రకంపనలకు లోనయ్యే అవకాశాలు ఉండటంతో గురక వచ్చే అవకాశాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ గొంతులోని కండరాలు వదులై గురక వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఊబకాయం వల్ల గొంతు చుట్టూ కొవ్వు పేరుకుని గాలి వెళ్లే వాహిక కుంచించుకుపోతుందని చెప్పవచ్చు.

జలుబు, సైనస్ లేదా ఇతర కారణాల వల్ల ముక్కు మూసుకుపోయినప్పుడు గురక సమస్య వేధించే అవకాశం ఉంటుంది. వెల్లకిలా పడుకున్న సమయంలో గాలి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి చివరకు గురక మొదలవుతుంది. స్లిప్ యాప్నియా అనే రుగ్మత ఉన్న వాళ్లు రాత్రిళ్లు నిద్రలో తమకు తెలీకుండా కొన్ని క్షణాల పాటు గాలి పీల్చుకోవడం ఆపేస్తారు. ఫలితంగా గురక సమస్య వేధిస్తుంది.

బీపీ, గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చిన వారిలో సైతం ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రాత్రి కలత నిద్ర వల్ల కూడా గురక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బరువును అదుపు తప్పకుండా చూసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. తలకింద ఎత్తుగా ఉండే దిండ్లు పెట్టుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ముక్కు మూసుకుపోయినప్పుడు తగు ఔషధాలు తీసుకుంటే గురక వేధించదని నిపుణులు వెల్లడిస్తున్నారు.