Health Tips: చిన్న పిల్లలకు ఆవు పాలు పట్టిస్తున్నారా…ఇది తెలుసుకోవాల్సిందే!

Health Tips: సాధారణంగా పాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆవు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనవి. ఆవు పాలలో ఎన్నో రకాలు పోషకాలు ఉండటం వల్ల వీటిని పోషకాల గని అని కూడా అంటారు. ఆవు పాలలో కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్స్, అనేక రకాల విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఆవు పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ ఆవు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో..
కానీ చిన్న పిల్లలకు ఆవు పాలు పట్టడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిన్న పిల్లలకు ఆవు పాలు పట్టించటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆవుపాలలో క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాల్షియం అధికంగా ఉన్న పాలు తాగటం వల్ల ఉన్న పెద్దలకు మంచిది. కానీ చిన్న పిల్లలకు ఆవు పాల ద్వారా వారికి కావలసిన దానికంటే అధిక మొత్తంలో క్యాల్షియం లభించటం వల్ల ఐరన్ గ్రహించే శక్తి కోల్పోతారు. తద్వారా వారిలో రక్తహీనత సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఆవు పాలలో ఉండే లాక్టోజ్ అధికంగా ఉండటం వల్ల పిల్లలకు కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా విరేచనాలు, డయేరియా వ్యాది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవుపాలలో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల పిల్లలు వయసు పెరిగే కొద్దీ వారిలో థైరాయిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఆవు పాలలో ఉండే ఎంజైమ్స్ వల్ల పిల్లల్లో నిద్ర లేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.అందువల్ల చిన్న పిల్లలకు ఆవు పాల కి బదులు గేదె పాలు పట్టించడం మంచిది. ఒకవేళ ఆవు పాలు పటించాలనుకున్నా వాటిలో కొన్ని నీటిని కలిపి పట్టించాలి.