Palla Srinivasa Rao: హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటన సంచలనంగా మారుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకి ఈ ఘటన మరింత పెద్దదవుతూనే ఉంది. మరి ముఖ్యంగా నిన్నటి రోజున ఈ ఘటన చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి గట్టి షాక్ ఇస్తూ తాను సీఎంగా ఉన్నంతవరకు టికెట్ రేట్లు పెంచేది లేదు బెనిఫిట్ షోలు వేసేది లేదు అంటూ తెగేసి మరి చెప్పారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ని సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు స్పందించడం పట్ల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడంతో ఈ ఘటన మరింత వైరల్ గా మారింది. దీంతో ఈ విషయంపై రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప2 సినిమా తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వస్తున్నారని సమాచారం ఉన్నా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం ఎవరి తప్పు, బెనిఫిట్ షోలు రద్దు చేయాలనే నిర్ణయం సరైనది కాకపోవచ్చు. నేను కూడా పుష్ప 2 సినిమాకు వెళ్ళాను కానీ అభిమానుల హడావిడి వలన సినిమా చూడలేకపోయాను.
ఒకరిని ఒకరు తప్పు పట్టడం కన్నా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే మంచిది అని ఆయన అన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని మా ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తాము. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పుడు చాలా రద్దీ అయింది. ఇలాంటి సమయంలో ఇంకోచోట డెవలప్ జరిగితే బాగుంటుంది. ఇక్కడికి కూడా సినీ పరిశ్రమ వస్తే ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మా ఉపముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా పరిగణించాలని కోరుకుంటున్నాను అని అన్నారు పల్లా శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.