మన దేశంలో చాలామంది గుట్కా, పొగాకు వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని తెలిసినా ఆ అలవాటును మానుకోలేరు. గుట్కా, పొగాకు తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని చెప్పవచ్చు. గుట్కా, పొగాకు ఎక్కువగా తీసుకుంటే నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంలో ఇవి దోహదపడతాయి. గుట్కా, పొగాకు దంతాలను దెబ్బ తీస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.
గుట్కా, పొగాకు ఎక్కువగా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గుట్కా, పొగాకు తయారీ కోసం వేర్వేరు రంగులు, రసాయనాలను వాడతారు. వీటి వినియోగం వల్ల హార్మోన్లపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. గుట్కా, పొగాకు కొన్ని సందర్భాల్లో మన శరీరంలోని డీ.ఎన్.ఏను సైతం దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి. గుట్కా తీసుకోవడం వల్ల శరీరంలో వేర్వేరు అవయవాలపై ప్రభావం పడుతుంది.
గుట్కా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. గుట్కా ఎవరైతే తీసుకుంటారో వాళ్లు వేర్వేరు క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు ఉంటాయి. మన శరీరంలోని ఎంజైమ్ లపై గుట్కాలు నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. గుట్కాలు తీసుకోవడం వల్ల సెక్స్ హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. శరీరంలోని హార్మోన్ల ప్రక్రియను ఇవి అడ్డుకుంటాయి.
గుట్కాలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. గుట్కాలు తినేవాళ్లు ఇకనైనా ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుట్కాలను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.