మనలో చాలామంది చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మన చుట్టూ ఉండే కొన్ని మొక్కలు మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశం అయితే ఉంటుంది. బ్లాక్ నైట్ షేడ్ అనే మొక్క మతి చలించడానికి మరణానికి కారణమవుతుందని చెప్పవచ్చు. ఈ మొక్క ఎంతో ప్రమాదకరమైన మొక్క కావడం గమనార్హం. గన్నేరు మొక్క వాసన పీలిస్తే తీవ్రమైన గుండె సమస్యలు వేధిస్తాయి.
మన చుట్టూ ఎక్కువగా కనిపించే మొక్కలలో సర్పగంధ ఒకటి కాగా ఇందులో ఉండే ట్రెమజాల్ వల్ల జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫాక్స్ గ్లోవ్ అనే మొక్క కూడా ప్రమాదకరమైన మొక్క కాగా ఈ మొక్క గుండె స్పందనలను దెబ్బ తీస్తుంది. వాటర్ హెమ్లాక్ అనే మొక్క అత్యంత విషపూరిత మొక్క కాగా నాడీ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి.
గురువింద గింజలు సైతం ఆరోగ్యానికి హాని కలిగించే ఛాన్స్ ఉంటుంది. మంచినీల్ అనే చెట్టు కూడా ఒకింత విషపూరితం కాగా ఈ చెట్టు తీవ్రమైన చర్మ సమస్యలను కలిగించడంతో పాటు శరీరంలోని అవయవాలను దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి. ఈ మొక్కలు చుట్టుపక్కల ఉంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ మొక్కలు పొలాల్లో ఉంటే ఆ మొక్కలను తొలగిస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ మొక్కల వల్ల దీర్ఘకాలంలో ఎన్నో నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ మొక్కలను నాశనం చేస్తే మంచిది. అడవి మార్గాల్లో ప్రయాణించే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.