మనలో చాలామంది వంటకాలలో బిర్యానీ ఆకును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. బిర్యానీ ఆకు టేస్ట్ కొంతమందికి నచ్చితే మరి కొందరికి అస్సలు నచ్చదని చెప్పవచ్చు. అయితే బిర్యానీ ఆకు వల్ల అదిరిపోయే లాభాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో మధుమేహంతో బాధ పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
మధుమేహం సమస్యతో బాధ పడేవాళ్లు బిర్యానీ ఆకును తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఒక పాత్రలో బిర్యానీ ఆకులు వేసి ఆ ఆకులను నీళ్లతో మరిగిస్తే మంచిది. ఆ తర్వాత మరిగించిన నీళ్లను చల్లార్చాలి. ఈ విధంగా చేయడం ద్వారా నీటిలో ఔషధ గుణాలు కలిసే అవకాశాలు ఉంటాయి.
ఆ తర్వాత బిర్యానీ ఆకులను తొలగించి రోజుకు సగం గ్లాస్ చొప్పున మూడు రోజుల పాటు కషాయాన్ని తాగాలి. ఈ విధంగా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. వరుసగా మూడు రోజుల పాటు తీసుకుని ఆ తర్వాత రెండు రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. ఈ విధంగా చేసిన తర్వాత మళ్లీ వరుసగా మూడు రోజుల పాటు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
చిరుధాన్యాలను తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. షుగర్ వ్యాధి బారిన పడిన వాళ్లు ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయి.