Food Combination: పొరపాటున ఈ ఆహార పదార్థాలను కలిపి తింటున్నారా…. జాగ్రత్త!

Food Combination: మన ఇప్పటి బిజీలైఫ్ వల్ల హడావిడి పనుల కారణంగా ఏ ఏ పదార్థాలను కలిపి తింటున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నాము. కానీ మన పూర్వీకులు ఆహారం పట్ల ఎంతో శ్రద్ధ చూపించేవారు. సరైన ఆహార పదార్థాలతో కలిపి తినేవారు. అందుకేనేమో అప్పటి వారు చాలా గట్టి అంటారు. కానీ ఇప్పుడు మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఆలోచించడం లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం కలిగే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.అందుకే కొన్ని రకాల ఆహార పదార్ధాలను పొరపాటున కూడా కలిపి తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు మరి ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం…

* పాలు – చేపలు: పాలు మరియు చేపలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవి రెండు అనిమల్ ప్రొడక్ట్స్ అయినప్పటికీ పాలను మాత్రం వెజ్ గా పరిగణిస్తారు. అలాంటప్పుడు పాలు మన శరీరంలో చల్లదనాన్ని ఉత్పత్తి చేస్తాయి . కానీ చేపల మాత్రం మన శరీరంలో ఉష్ణోగ్రతను ఉత్పత్తిచేస్తాయి. కాబట్టి ఇవి రెండు మన శరీరంలో వ్యతిరేకంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఇవి రెండూ అధిక ప్రోటీనులు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని వేరువేరుగా తీసుకోవడమే మంచిది.

* పాలు – అరటిపండు: పాలు అరటిపండు కలిపి తినమని మనకి మామూలుగా చెబుతూ ఉంటారు కానీ ఈ రెండు మన జీర్ణక్రియలో జీర్ణమవడానికి వేరు వేరు సమయాలను తీసుకుంటాయి కావున జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొట్టఉబ్బరం లాంటి సమస్యలు కూడా వస్తాయి.

* పెరుగు – ఫ్రూట్స్: ఈ రెండింటినీ కలిపి తినడం వలన ఊపిరితిత్తులలో కఫం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పెరుగును రాత్రివేళల్లో తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణం అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పెరుగును ఉదయం వేళకాని, మధ్యాహ్నం వేళ గాని తినటం మంచిదట .

* నెయ్యి – తేనె: సాధారణంగా మనం నెయ్యి ని వేడి వేడి అన్నంలో కాని, పాయసంలో కానీ, స్వీట్లలో లో ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే తేనెను తీపి పదార్థాలలోను ఉపయోగిస్తారు కానీ ఈ రెండింటినీ కూడా కలిపి తీసుకోవడం వలన వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయుర్వేదం తెలుపుతుంది.