Health Tips: నెలసరి సమయంలో ఈ సమస్యలు వేధిస్తున్నాయా? ఈ పద్ధతుల ద్వారా వాటి నుండి విముక్తి పొందవచ్చు..!

Health Tips: సాధారణంగా మహిళల్లో నెలసరి సమయంలో అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అలా మహిళలను వేధిస్తున్న సమస్యలలో కడుపునొప్పి, నడుము నొప్పి, కాళ్లు చేతులు లాగటం వంటి సమస్యలు ముఖ్యమైనవి.కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

బాలాసనం: ఈ ఆసనం వేయడం వల్ల కడుపు నొప్పి నుండి విముక్తి పొందవచ్చు. ముందుగా మోకాళ్ళ మీద కూర్చుని ముందుకు వంగి తలను నేలకు ఆనించి చేతులను చాపాలి. నెమ్మదిగా గాలి పీల్చు తూ వదులుతూ ఉండాలి. 30 సెకండ్ల పాటు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

సేతు బంధాసనం: నేల మీద వెల్లకిలా పడుకొని కాళ్ళు మడిచి,నడుము చేతులతో పట్టుకోవాలి. మొత్తం శరీర బరువు కాళ్ల మీద మోపుతూ నెమ్మదిగా నడుమును పైకి లేపాలి. 30 సెకండ్ల పాటు ఇలా చేయటం వల్ల నడుము నొప్పి నుండి విముక్తి లభిస్తుంది.

యోగాసనాలు కాకుండా గుప్పెడు బియ్యాన్ని వేయించి ఒక మెత్తటి బట్టలో చుట్టి కడుపు మీద, నడుము మీద కాపడం పెట్టుకోవడం వల్ల నొప్పి నుండి కూడా తొందరగా విముక్తి లభిస్తుంది.