విటమిన్ సి లోపాన్ని నివారించడానికి, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లు మరియు సరైన ఆహార పద్ధతులను పాటించడం ద్వారా విటమిన్ సి స్థాయిలను పెంచుకోవచ్చు. నారింజ, కివి, నిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, క్యాబేజీ, బచ్చలికూర, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, టమోటోలు, బంగాళాదుంపలు వంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
డాక్టర్ల సిఫారసు మేరకు, విటమిన్ సి సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా లోపాన్ని నివారించవచ్చు. విటమిన్ సి అధిక ఉష్ణోగ్రతలకు సున్నితంగా ఉంటుంది కాబట్టి, ఆహారాన్ని ఉడకబెట్టడం, ఆవిరి చేయడం లేదా అధిక వేడిలో ఉంచడం వంటివి చేయకుండా, పచ్చి పండ్లు మరియు కూరగాయలను తినడం మంచిది. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు విటమిన్ సి ఉన్న ఆహారాలను భాగం చేసుకోవాలి.
తగినంత విటమిన్ సి ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా లోపాన్ని నివారించవచ్చు. విటమిన్ సి వేడికి సున్నితంగా ఉంటుంది, కాబట్టి ఆహారాన్ని వేడికి ఎక్కువసేపు గురిచేయకుండా చూడాలి. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం లేదా వండడం ద్వారా విటమిన్ సి పరిమాణం తగ్గవచ్చు. విటమిన్ సి లోపం యొక్క తేలికపాటి కేసులు మీ ఆహారంలో కొంత విటమిన్ సిని జోడించడం ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు.
సిట్రస్ పండ్లు మరియు కూరగాయలు విటమిన్ సి యొక్క సహజ వనరులు అని చెప్పవచ్చు. బొప్పాయి, సీతాఫలం మరియు స్ట్రాబెర్రీలు విటమిన్ సి అధికంగా ఉండే ఇతర పండ్లు అని చెప్పవచ్చు. విటమి సి లోపాన్ని తక్శణ చికిత్సతో సులువుగా కంట్రోల్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. విటమిన్ సి లోపం తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల సూచనలను పాటించాల్సి ఉంటుంది.