విద్యుత్ షాక్ కు గురైనప్పుడు, ముందుగా వ్యక్తిని విద్యుత్ నుండి వేరు చేయాలి. ఆ తరువాత, స్పృహ లేని వ్యక్తికి అవసరమైతే సీపీఆర్ చేయాలి. గాయాల కోసం తక్షణ వైద్య సహాయం కోసం కాల్ చేయడంతో పాటు చెక్క వస్తువులను ఉపయోగించి సదరు వ్యక్తిని విద్యుత్ షాక్ నుంచి వేరు చేయాలి. విద్యుత్ షాక్ వల్ల గాయాలైతే మాత్రం వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.
గట్టిగా షాక్ తగిలినప్పుడు, స్పృహ కోల్పోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. విద్యుత్ షాక్ నుండి దూరంగా ఉండటానికి, ఉపయోగించని పవర్ పాయింట్లలో సేఫ్టీ ప్లగ్‌లను చొప్పించడం మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు విద్యుత్ షాక్ రాకుండా చూసుకోవడానికి ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆఫ్ చేసి, అన్‌ప్లగ్ చేస్తే మంచిది.
పిల్లలు విద్యుత్ ప్లగ్స్ కు అందుబాటులో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కరెంట్ షాక్ కు గురైన వ్యక్తి స్పృహ కోల్పోకుండా ఉండటానికి అవసరమైన ధైర్యం చెబితే మంచిది. షాక్ కు గురైన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే పల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. నోటి ద్వారా గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపే ప్రయత్నం చేయాలి.
ఎలక్ట్రిక్ షాక్ వల్ల అయిన గాయాలకు పూతమందులు కానీ ఆయింట్ మెంట్స్ కానీ పూయడం చేయకూడదు. కరెంట్ షాక్ కు గురైన వాళ్లు ఎత్తు నుంచి పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. గాయాలను బట్టి ప్రథమ చికిత్స చేయాల్సి ఉంటుంది. కరెంట్ షాక్ కు గురైన వాళ్లలో గుండె స్పందనలలో తేడా వచ్చే అవకాశం అయితే ఉంది. కరెంట్ షాక్ తగిలితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.