నేరేడు పండు.. ఔషధాల మెండు.. నేరేడు పండ్లు తినడం వల్ల ఈ వ్యాధులను దూరం పెట్టవచ్చు?

నేరేడు పళ్ళు చూడటానికి, మాత్రమే కాకుండా తినడానికి కూడా ఎంతో రుచికరంగా నేరేడు పండ్లను తరచూ తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నేరేడు పండ్లలో మన ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరెన్నో పోషక విలువలు అధికంగా ఉంటాయి. నేరేడు పండు బ్లడ్ ప్రెజర్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు కూడా నేరేడు పళ్ళు తినడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు.

నేరేడు పండ్లు ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీనివల్ల జ్వరం, దగ్గు ,జలుబు వంటి వాటినుండి బయటపడవచ్చు . నేరేడు పండ్లలో పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలోని హై బిపి, హైపర్ టెన్షన్ వంటి సమస్యలను అదుపు చేయవచ్చు.
నేరేడు పండు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా అరికట్టవచ్చు.

నేరేడు పండు డిమెన్షియా, ఆమ్నీషియా వంటి ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. యూరినరీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా నేరేడు పండ్లు తినడం వల్ల ఆ సమస్యలను నయం చేసుకోవచ్చు.కొందరు గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను తినకూడదు అని పెద్ద వారు చెబుతుంటారు అయితే గర్భిణీ స్త్రీలు నేరేడు పండు తినడం వల్ల బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది కనుక నిరభ్యంతరంగా గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లు తినవచ్చు. ఇలా నేరేడు పండ్లను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు.