Ali: ఫార్మ్ హౌస్ వివాదం… నోటీసులు పై స్పందించిన అలీ… ఏమన్నారంటే?

Ali: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలికి ఇటీవల తెలంగాణ పోలీసులు అక్రమ కట్టడాలకు సంబంధించిన నోటీసులను పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా తనుకు నోటీసులు రావడం గురించి కమెడియన్ ఆలీ స్పందించారు.

అలీ ఫార్మ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయనకు గ్రామ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ నోటీసులపై అలీ స్పందిస్తూ.. ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం నా స్థలాన్ని నేను లీజుకు ఇచ్చాను. అయితే లీజుకి ఇచ్చిన స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. మరి ఈ నిర్మాణాలపై తాను ఎలాంటి సమాధానం చెప్పలేననీ, లీజు తీసుకున్న వారికి సమాధానం చెబుతారని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై నవంబర్ 5న ఒక నోటీసు ఇవ్వగా.. 22న గ్రామ కార్యదర్శి శోభారాణి మరో నోటీసు ఇచ్చారు.

ఇలా నోటీసులు రావడంతో ఆ నోటీసులను కూడా ఫామ్ హౌస్ లో పనిచేసే వారికే అందజేశామని తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతి పరిధిలోని అలీకి ఒక ఫామ్హౌస్ ఉంది. అయితే ఆ ఆ ప్రాంతంలో ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపట్టిన నేపథ్యంలోనే పంచాయితీ కార్యదర్శి ఆలీకి నోటీసులను పంపించడమే కాకుండా వెంటనే అనుమతి లేని నిర్మాణాలను ఆపాలని ఆదేశాలను జారీచేశారు.

ఇలా నవంబర్ 5వ తేదీ పంపిన నోటీసులకు అలీ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి నోటీసులను పంపించారు. ఇలా నోటీసులు పంపించిన వెంటనే ఆ నిర్మాణాలకు అలాగే ఆ స్థలానికి సంబంధించినటువంటి పత్రాలను సమర్పించి అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు. ఇలా అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపడితే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ అధికారులు వెల్లడించారు.