Ali: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతలపై వరుసగా కేసులు పెడుతూ వారికి నోటీసులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా నాయకుడిగా కొనసాగుతున్న సినీ నటుడు ఆలీ పూర్తిగా రాజకీయాలకు దూరమవుతున్నానని తాను ఇకపై ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని తెలిపారు. ఇక నేను కేవలం సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అంటూ ఆలీ తెలియజేశారు.
ఇలా అప్పటినుంచి ఈయన ఏ పార్టీకి మద్దతు తెలుపకుండా కేవలం తన సినిమా పనులలో బిజీగా ఉన్నారు అయితే ఇలా వైకాపా పార్టీ నుంచి ఆలీ రాజీనామా చేసినప్పటికీ కూడా ఈయనపై కేసులు నమోదు కావటం గమనార్హం. తాజాగా ఈయనకు తెలంగాణ పోలీసుల నుంచి నోటీసులు అందాయి.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పంచాయతీ పరిధిలో సినీనటుడు ఆలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు.
ఈ విషయంపై తన తరపు లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు ఆలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే తనకు నోటీసులు అందడంపై ఆలీ అంతర్గతంగా తన సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. తనపై కొందరు కావాలని ఈ విధమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆలీ ఆరోపణలు చేస్తున్నారు.
ఇక అలీ ఆరోపణలు చేసిన విధంగానే ఇది కూడా కుట్రలో భాగమైతే ఆయన స్నేహితులు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తనని ఆదుకోవాలి కదా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆలీకి జారీ చేసిన ఈ నోటీసులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అలీ వైకాపా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు ఏ కార్యక్రమంలో కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావనకు తీసుకురాలేదు. ఇక ఈయన తన సినిమాలు ఇతర కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు.