Tollywood : ఏ ఇండస్ట్రీ లో కూడా లేని విధంగా మన తెలుగు హీరోలను అభిమానులు దైవ సమానంగా కొలుస్తారు. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న మన టాలీవుడ్ స్టార్ లు ఒకరు ఇద్దరు కలిసి ఒక్క ఫొటోలో కనిపిస్తేనే ఎక్కడ లేని ఎనర్జీ తమ అభిమానులకు వచ్చేస్తుంది. ఇక ఆ అందరు హీరోల్లో సగం మంది అయినా కలిసి ఒకే దగ్గర చూడాలి అంటే అది ఎన్నేళ్లకు సాధ్యపడుతుందో కూడా చెప్పలేం.
కానీ ఇప్పుడు అలాంటి అద్భుత సంఘటనే చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కొరటాల శివ ఇలా దిగ్గజాలు అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం టాలీవుడ్ ప్రేక్షకులని ఇప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది.
అయితే దీనికి గట్టి కారణం కూడా లేకపోలేదు. కొంత కాలంగా ఏపీలో ప్రధానంగా మారిన సమస్య టికెట్ ధరలపై మాట్లాడేందుకు ఏపీ సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో చిరు సహా వీరంతా కదిలి వెళ్లారు. మరి ఈ క్రమంలో చిరు అందరికి కలిపి ఒక ఫోటో షేర్ చెయ్యడం ఆసక్తిగాను ఒకింత వైరల్ గాను మారిపోయింది.
ఈరోజు మహేష్ బాబు మరియు తన సతీమణి నమ్రతల 17వ పెళ్లి దినోత్సవం సందర్భంగా తమ ప్రయాణంలో మెగాస్టార్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. దీనితో ఈ మూమెంట్ లో ప్రభాస్ రాజమౌళి మహేష్ కొరటాల అందరు కూడా ఫోటోకి స్టిల్ ఇవ్వడంతో మన టాలీవుడ్ లో ఇది ఒక మధురమైన స్నాప్ గా మిగిలిపోయింది అని చెప్పొచ్చు. దీనితో ఈ ఫోటో చూసిన అందరి అభిమానులు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.
Wishing @urstrulyMahesh &#NamrataShirodkar one of the most loveable and loved couples a very happy 17th Wedding Anniversary!! Wishing you both a lifetime of love, laughter and togetherness! pic.twitter.com/jp8RhrsHxn
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 10, 2022