తన నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుని వరుస అవకాశాలు అందుకుంటున్నారు నటి మృణాల్ ఠాకూర్.’సీతారామం’తో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ముద్దు సన్నివేశాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘రొమాంటిక్ సీన్స్‌లో నటించడం నాకు సౌకర్యవంతంగా ఉండదు. ముద్దు సన్నివేశాలు ఉన్న కారణంగా కొన్ని సినిమాలు వదులుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలాంటి వాటిలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చదు. అందుకే నో చెప్పాను. అటువంటి సన్నివేశాల్లో నన్ను చూస్తే వాళ్లు ఏమనుకుంటారో అని భయం వేసేది. అది కథలో భాగమేనని మంచి పాత్ర అయినప్పుడు ఈ కారణంగా సినిమాలో వదులుకోలేనని వాళ్లకు వివరించాను. దీంతో అంగీకరించారు. కానీ, ఆ సన్నివేశాలకు నో చెప్పడం కారణంగా ఎన్నో మంచి అవకాశాలు చేజారిపోయాయి’ అని మృణాల్ చెప్పారు.
ఇటీవల ఆమె ఓ ఆంగ్లవిూడియాతో మాట్లాడుతూ కెరీర్ ప్రారంభం రోజులను గుర్తుతెచ్చుకున్నారు. ఇండస్టీక్రి వచ్చిన తొలినాళ్లలోనే ఒక భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని.. కొన్ని కారణాల వల్ల దాన్ని వదులుకున్నట్లు చెప్పారు. ఇంటిమేట్ సీన్స్ ఉన్న కారణంగానే ఆ భారీ ప్రాజెక్ట్‌ను మృణాల్ రిజక్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మృణాల్ చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.