ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్ షిప్ దొరకడం చాలా కష్టమని.. అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటీ ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకోవడం. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్దతిని చాలా మంది హీరోయిన్స్ పాటిస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా.. ఇప్పుడు హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆ జాబితాలో చేరారు. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నానని.. గత రెండేళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నట్లు ఓ వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. ‘ఇది నా వ్యక్తిగత విషయం.. కానీ అందరితో పంచుకోవాలా ?వద్దా? అని చాలాసార్లు ఆలోచించాను. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ఈ ప్రపంచంలో ఉన్నారు.
ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ?ఎప్పుడు పిల్లలను కనాలి ? అని ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం అని నేను భావించాను. దీని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ సాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. తల్లి కావాలనేది నా కల. కానీ అందుకు కొన్ని సంవత్సరాలు ఆలస్యం కావచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆసుపత్రులంటే భయం ఉన్న నాలాంటి వారికి ఇది పెద్ద సవాలుగా మారింది.
ఎందుకంటే హార్మోన్ల ఇంజక్షన్స్ కారణంగా నేను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ కళ్లు తిరిగి పడిపోయాను. ఇది విలువైనదేనా అని అడిగితే కచ్చితంగా అవును అని చెబుతాను. విూరు ఏ పని చేసినా విూకోసమే చేయండి.. ఇందుకు ఎప్పుడూ నా పక్కనే ఉన్న నా గైనకాలజిస్ట్ డాక్టర్ రివ్మిూ.. మా అమ్మకు ధన్యవాదాలు‘ అంటూ మెహ్రీన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం మెహ్రీన్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.