‘శబరి’ నుంచి అలసిన ఊపిరి.. పాట వచ్చేసింది!

కోలీవుడ్‌ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న నటిస్తోన్న చిత్రం ‘శబరి’. అనిల్‌ కట్జ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మల్టీలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే మేకర్స్‌ ‘శబరి’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ రిలీజ్‌ చేసిన వీడియోలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ బైక్‌పై స్టైలిష్‌ గా రైడ్‌ చేస్తున్న విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం నుంచి అలసిన ఊపిరి సాంగ్‌ను లాంఛ్‌ చేశాడు డైరెక్టర్‌ కరుణకుమార్‌. వరలక్ష్మి సోలో ట్రాక్‌ సినిమాకు హైలెట్‌గా నిలవనుందని విజువల్స్‌ చూస్తే అర్థమవుతోంది.

ఈ సందర్భంగా కరుణకుమార్‌ మాట్లాడుతూ.. పాట లిరిక్స్‌, విజువల్‌ ప్రెజెంటేషన్‌ నాకు బాగా నచ్చాయి. సినిమాలో చూపించిన తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌ యూనివర్సల్‌ స్థాయిలో ఉంది. సినిమా కోసం టీమ్‌ తమ మనస్సు పెట్టి పనిచేసింది. వరలక్ష్మి లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో అద్భుతంగా నటిస్తోంది. దర్శకుడు అనిల్‌ కట్జ్‌ చాలా ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనన్నాడు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కూతురితో కలిసి అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికొస్తుంది.

అయితే ఆ ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశిస్తాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగిందనేది సస్పెన్స్‌ లో పెడుతూ కట్‌ చేసిన వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ వీడియోతో సినిమాలో థ్రిల్లింగ్‌కు గురి చేసే అంశాలున్నట్టు చెబుతున్నాడు. ‘శబరి’ చిత్రంలో గణేశ్‌ వెంకట్రామన్‌, మిమే గోపి, సునయన, శశాంక్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నాడు. మహర్షి కొండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్‌ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబి కృతిక, రాజశ్రీ నాయర్‌, భద్రమ్‌, ఫణి, కృష్ణ తేజ, ప్రభు, అర్చన అనంత్‌, కేశవ్‌ దీపక్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.