లవ్‌ డ్రామా సినిమాలంటే ఇష్టం: మాళవికా మోహన్‌

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో ‘తంగలాన్‌’, తెలుగులో ‘రాజా సాబ్‌’, హిందీలో ‘యుద్ర’ చిత్రాలున్నాయి. అయితే ఈ మూడు చిత్రాల షూటింగ్‌కు విరామం రావడంతో ఆమె కాస్త చిల్‌ అవుతున్నారు.

ఇటీవల ఫారిన్‌ ట్రిప్‌ వేసిన ఆమె ప్రస్తుతం ఇంట్లో ఉంటూ అభిమానులతో నెట్టింట ముచ్చట్లు పెడుతున్నారు. ‘ఆస్క్‌ మాళవిక’ అంటూ ట్విటర్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించారు. ఆమె నటిస్తున్న చిత్రాలు, ఇష్టాయిష్టాల గురించి పలువురు నెటిజన్లు అడగగా, ఓ నెటిజన్‌ మాత్రం అసహనానికి గురయ్యే ప్రశ్న అడిగాడు. ఇంతకీ అతను అడిగిన ప్రశ్న ఏంటంటే.. ‘గ్లామర్‌ షో చేయడం కాకుండా పాత్రకు తగ్గట్లు యాక్ట్‌ చేయడం ఎప్పుడు మొదలుపెడతారు’ అని అడిగాడు.

ఆ ప్రశ్నకు అసహనానికి లోనైన మాళవిక ‘నేను చేయను. నీకు ఏమైనా ఇబ్బందా?’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.’ఫీల్‌ అవ్వకండి మేడమ్‌’, ‘విూరు అలాంటి వారికి ఎందుకు ఆన్సర్‌ ఇస్తారు’ అంటూ మరికొందరు అభిమానులు ఆమెను కూల్‌ చేశారు. తనకు లవ్‌ డ్రామా, రొమాంటిక్‌ కామెడీ, థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పారు. కథానాయికల్లో అనుష్కాశెట్టి, సమంత అంటే చాలా ఇష్టమని, ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ హృతిక్‌ రోషన్‌ అని తెలిపింది.