చకచకా ‘తండేల్‌’ షూటింగ్‌

టాలీవుడ్‌ యాక్టర్‌ అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’కు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కోలీవుడ్‌ భామ సాయిపల్లవి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో పోషిస్తోంది. ‘తండేల్‌’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌కు సంబంధించిన వార్త ఇప్పటికే అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది.’తండేల్‌’ రైట్స్‌ను పాపులర్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌ దక్కించుకోగా.. ‘తండేల్’ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ప్లిక్స్‌ రూ.40 కోట్లకు సొంతం చేసుకుంది.

షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్‌ స్టిల్‌ ఒకటి బయటకు వచ్చింది. చైతూ, సందీప్‌ వేద్‌, జబర్దస్త్‌ మహేశ్‌, చందూ మొండేటి అండ్‌ టీం షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన స్టిల్‌ను షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘తండేల్‌’ నుంచి లాంఛ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్‌ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ‘తండేల్‌’లో సాయిపల్లవి పోషిస్తున్న సత్య పాత్ర ఇంట్రడక్షన్‌ వీడియో ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.

ఈ మూవీలో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. ‘తండేల్‌’ డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో చైతూ అనుకోకుండా పాకిస్థాన్‌ పాక్‌ ప్రాదేశిక జలాల వెంబడి అరెస్టైన మత్య్సకారుడి పాత్రలో కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ‘తండేల్‌’ 2018లో గుజరాత్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. టాప్‌ బ్యానర్‌ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.