అగ్ర కథానాయిక శృతిహాసన్ తన ప్రేమబంధానికి గుడ్‌బై చెప్పిందా? అంటే ఔననే అంటున్నాయి ముంబయి సినీ వర్గాలు. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తన లవ్‌ఎఫైర్ పై శృతిహాసన్ బహిరంగంగా ఎప్పుడూ స్పందించనప్పటికీ.. ప్రియుడితో తీయించుకున్న ఫొటోలను తరచుగా సోషల్‌విూడియాలో పోస్ట్ చేసేది. ఈ జంట ముంబయిలో సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ జంట విడిపోయినట్లు తెలిసింది. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారని, పరస్పర అంగీకారంతోనే తమ బంధానికి గుడ్‌బై చెప్పుకున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈ ప్రేమజంట సోషల్‌విూడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు.”ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఇతరులనూ అర్థం చేసుకున్నా” అంటూ శృతిహాసన్ పెట్టిన పోస్ట్ కూడా వారి బ్రేకప్‌ను నిర్దారిస్తున్నదని అమె అభిమానులు అంటున్నారు.
అయితే ఈ వార్తల్లో నిజానిజాలేమిటో తెలియాలంటే ప్రేమికులిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు. ఇక కెరీర్‌పరంగా శృతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం డెకాయిట్, చెన్త్నె స్టోరీ చిత్రాల్లో శృతిహాసన్ నటిస్తున్నది.