అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ టీవీలతో పాటు యూల్యూబ్ ఛానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలూ ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా అంశాలతో పాటు ఇతర ముఖ్య విషయాలు, సోషల్ విూడియాల్లో వైరల్ అవుతున్న వాటిపై క్లారిటీ ఇచ్చారు.
అయితే అల్లరి నరేశ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు గత కొంత కాలంగా నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తుండడంతో ఆ వార్తలపై నరేశ్ మొట్టమొదటి సారి నోరు విప్పి అసలు విషయం చెప్పారు. ‘దేవర’ సినిమా ఆఫర్ నా వద్దకు రాలేదని, అసలు ఆ విషయమే నాకు తెలియదని అన్నారు.. ఛాన్స్ వస్తే వదులుకోనన్నారు.
ఇప్పటికే మహేశ్ బాబుతో మహర్షి, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాల్లో నటించానని, కథ బాగుంటే ఏ హీరో చిత్రంలోనైనా నటిస్తానని.. ఈ విషయంలో నాకు ఎలాంటి మొహమాటం లేదని స్పష్టం చేశారు. దిలాఉండగా.. సినిమా నేపధ్యం కూడా కథానాయకుడైన గణ (నరేష్) 25 రోజుల్లో పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడని ఒక పూజారి ద్వారా తెలుసుకుంటాడు. దీంతో అమ్మాయి కోసం వేట మొదలుపెడతారు.
అదే సమయంలో గణ ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు, ఆమెకు కూడా గణ అంటే ఇష్టం అంటుంది, ఇక నెక్ట్స్ పెళ్లే అని అనుకుంటున్న సమయంలో ఫరియా ’ఆ ఒక్కటీ అడక్కు’ అని సున్నితంగా తిరస్కరిస్తుంది. ఇంకేముంది దానితో గణ కథ మళ్ళీ మొదటికి వస్తుంది, అమ్మాయి కోసం వేట మొదలవుతుంది. చివరకు గణ కథ ఏమైంది, ఎటు తిరిగింది అనే విషయాలన్నీ వినోదభరితంగా తెరకెక్కించారు.