కేసీఆర్ నిర్ణయం ప్రభాస్ ప్లేస్ మార్చేసింది

Adipurush shoot will be happen in Hyderabad

Adipurush shoot will be happen in Hyderabad

ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ కూడ ఒకటి. పేరుకు ఇది ప్రభాస్ సినిమానే అయినా పూర్తిస్థాయి హిందీ సినిమానే. తెలుగులో సైతం రూపొందిస్తున్నారనే మాటే కానీ దర్శకుడు, నటీనటులు ఎక్కువ భాగం హిందీ వాళ్ళే. అందుకే ప్రభాస్ చేస్తున్న ఇతర సినిమాలను ఆన్ చేసుకున్నట్టు దీన్ని మన తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకోలేకున్నారు. టాలీవుడ్ హీరో చేసున్న ఇంత పెద్ద సినిమాలో తెలుగు వాళ్లకు పెద్దగా భాగస్వామ్యం లేదనే భావం ఉంది. షూటింగ్ సైతం మొత్తం ముంబైలోనే ప్లాన్ చేశారు. దీంతో అంత పెద్ద సినిమా హైదరాబాద్లో జరిగితే మన ఇండస్ట్రీ జనాలకు బోలెడంత పని దొరుకుతుంది కదా అన్నవారు లేకపోలేదు.

ఈ అభిప్రాయాల్లో నిజం ఉంది. ‘ఆదిపురుష్’ లాంటి సినిమా హైదరాబాద్లో జరిగే మన సినీ కార్మికులకు మూడు నాలుగు నెలలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపాది దొరికినట్టే. అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దీన్ని సాధ్యమయ్యేలా చేశాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మహారాష్ట్రలో చిత్రీకరణ జరపడం అసాధ్యంగా ఉంది. ధైర్యం చేసి చేద్దామన్నా లాక్ డౌన్ ఇబ్బందులు. కానీ హైదరాబాద్లో నో లాక్ డౌన్. సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ‘ఆదిపురుష్’ టీమ్ మిగిలిన చిత్రీకరణను హైదరాబాద్లో చేరాలని డిసైడ్ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేసి మూడు నెలలు షూటింగ్ చేయాలని ప్రభాస్ బృందం భావిస్తోంది. అలా చేస్తేనే అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ అవుతుంది. సో.. దీని వలన మన కార్మికుల్లో వందల మందికి ఉపాధి దొరికినట్టే.