సొంత పార్టీ ప్ర‌భుత్వంపై ఆనం ఫైర్..ఆయ‌న వెనుక షాడో!

వైకాపా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్త‌యింది. యంగ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌పై ఇప్పుడు స‌మ‌గ్రంగా రివ్యూ చేసుకుంటున్నారు. ఏడాదిలో చేసిన ప‌నులేంటి? చేయాల్సిన ప‌నులేంటి? మేనిఫెస్టోలో ఇచ్చివ‌న్నీ చేస్తున్నామా? ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయా? లేదా? ఇలా అన్నిర‌కాలుగా సీఎం అధికారుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. సంక్షేమ ఫ‌లాలు ప్ర‌తీ ఇంటికి అందాల‌ని అలా కాని ప‌క్షంలో ఆ నియోజిక వ‌ర్గం ఎమ్మెల్యేపై క‌ఠిన‌మైన చ‌ర్య‌ల‌కు సైతం వెనుకాడ‌బోమ‌ని ఇప్ప‌టికే సీంఎ హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు ముఖ్యంగానీ..పాల‌కులు కాద‌ని మంత్రుల‌ను..ఎమ్మెల్యేల‌కు త‌న‌దైన శైలిలో అల్టిమేటం ఇవ్వ‌డం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్ ఏడాది పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి విమ‌ర్శ‌లు చేసారు. వైకాపా ఏడాది పాల‌న‌లో కేకు సంబ‌రాలు తప్ప త‌న నియోజ‌క వ‌ర్గంలో అభివృద్ది శూన్య‌మ‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు రాష్ర్ట‌, జిల్లా స్థాయి యంత్రాంగ‌పై విరుచుకుప‌డ్డారు. సీఎం రాసిన లేఖ‌ల‌నే అధికారులు ప‌ట్టించుకోలేద‌ని ఎద్దేవా చేసారు. మ‌రో ఏడాది వేచి చూస్తాన‌ని..అప్ప‌టివ‌ర‌కూ ప‌నులు జ‌ర‌గ‌క‌త‌పోతే ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాన‌ని హెచ్చ‌రించారు. జిల్లాలో వెంక‌ట‌గిరి అనే ఒక నియోజ‌క వ‌ర్గం ఒక‌టి ఉంద‌ని దాన్ని అధికారులు గుర్తించాల‌న్నారు.

ముఖ్య‌మంత్రి అదేశాల‌నే అధికారులు ప‌ట్టించుకోలేదు. మాలాంటి వాళ్లు అధికారుల‌కు ఓ లెక్క అంటూ?  ఎద్దేవా చేసారు. జిల్లాలో జ‌ల దోపిడీ లెక్క‌లు తేల్చాల‌ని డిమాండ్ చేసారు. అయితే ఆనం వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వంపై ఉద్దేశ పూర్వ‌కంగా చేసిన‌ట్లు కొంద‌రు ఆరోపిస్తున్నారు. అన్ని నియోజ‌క వ‌ర్గాలు అభివృద్ది చేస్తున్న‌ప్పుడు ఆయ‌న నియోజ‌క వ‌ర్గం ఎందుకు వ‌దిలేస్తార‌ని అంటున్నా రు. ఒక‌వేళ ఆయ‌న మ‌ర్చిపోయినా ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తారు..అప్పుడైనా స‌మాధానం చెప్పాల్సింది ప్ర‌భుత్వం కాబ‌ట్టి ఆనం వ్యాఖ్య‌లు పూర్తిగా, ఉద్దేశ పూర్వకంగా చేసిన‌ట్లు ఉంద‌ని ప‌లువురి అభిప్రాయం. అయితే ఆనం వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసాయి. ఆనం వెనుక షాడో ఆయ‌న్ని ఇలా ప్రేరేపిస్తున్నాయా? అన్న అనుమానాలు క‌ల్గుతున్నాయి.