మోనిక రెడ్డి ప్రధాన పాత్ర‌లో ‘ఓ లేడీ ఓరియెంటెడ్’ చిత్రం

`భీమ్లానాయ‌క్` చిత్రంతో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్ర‌లో సుధా క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం  రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాకేష్ రెడ్డి యాస‌ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భాస్కర్ రెడ్డి. ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేడ్స్ స్టూడియో ఫౌండ‌ర్ దేవి ప్ర‌సాద్ భ‌లివాడ‌ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు. మ‌రో అతిథి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల‌ స‌మావేశంలో దేవి ప్ర‌సాద్ భ‌లివాడ‌ మాట్లాడుతూ…“ఒక మంచి కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా క‌లిసి చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది. మోనిక రెడ్డి ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ ఫిలింగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అనుష్క‌, న‌య‌న తార‌లా లేడీ సూప‌ర్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకోవాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

హీరోయిన్ మోనిక రెడ్డి మాట్లాడుతూ..`` నేను ఇప్ప‌టి వ‌ర‌కు చాలా చిత్రాల్లో న‌టించాను. ఈ సినిమా నాకు ఎంతో ప్ర‌త్యేకం. స్టోరీ మొత్తం నా మీదే న‌డిచే లేడీ ఓరియెంటెడ్ ఫిలింలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పిన విధానం నాకు చాలా న‌చ్చింది. నా క్యార‌క్ట‌ర్ ను చాలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేశారు. అంద‌రూ కొత్త వారైనా ..ఎంతో అనుభ‌వం, టాలెంట్ ఉన్న టీమ్ తో ప‌ని చేయ‌డం హ్యాపీగా ఉంద‌న్నారు.

ద‌ర్శ‌కుడు రాకేష్ రెడ్డి యాస‌ మాట్లాడుతూ…“ఇదొక పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్. ఒక లేడీ ధైర్య సాహసాలతో రాజ్యం కోసం పోరాడితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమిది. టాలీవుడ్ లో న‌టిగా మంచి గుర్తింపు ఉన్న మోనిక రెడ్డి గారు నేను చెప్పిన స్టోరీ న‌చ్చి వెంట‌నే సినిమా ఓకే చేశారు. ఆ రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలో ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు. అలాగే దేవి ప్ర‌సాద్ గారు మా ప్రాజెక్ట్ కి బ్యాక్ బోన్ లాంటి వారు. ఆయ‌న వ‌ల్లే ఇంత త్వ‌ర‌గా సినిమా సెట్స్ మీద‌కు వ‌చ్చింది. వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇక మీద‌ట కూడా ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నా. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భాస్కర్ రెడ్డి అన్నీ తానై ప్రాజెక్ట్ ను ముందుకు న‌డిపిస్తున్నాడు“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..“మా సినిమాకు స‌పోర్ట్ చేస్తోన్న దేవి గారితో పాటు ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. భీమ్లానాయ‌క్ లాంటి ఎన్నో పెద్ద చిత్రాల‌తో పాటు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నఒక ఓటీటీ ఫిలింలో న‌టించిన మోనిక రెడ్డిగారు మా సినిమా చేయ‌డానికి ముందుకు రావ‌డంతో మా యూనిట్ అంద‌రికీ మంచి ఎన‌ర్జీ వ‌చ్చింది. టీమ్ అంతా కూడా ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు. డిఒపి అరుణ్ కొలుగూరి ఫోక్ సాంగ్స్ ఇండస్ట్రీలో ఫేమస్. 150 కి పైగా ఫోక్ సాంగ్స్ కి వర్క్ చేశారు. అలాంటి కెమెరామెన్ మా సినిమాకు పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు షూటింగ్ ప్రారంభ‌మై కంటిన్యూయ‌స్ గా షెడ్యూల్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో టైటిల్ తో పాటు మిగ‌తా సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డిస్తాం“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సుమ‌న్‌, భాను ప్ర‌శాంత్, హారిక‌, ఆశిక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.