సాయి రోనక్, దేవిక సతీష్ ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి కెటీ దర్శకత్వంలో ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఎస్ఎన్ స్వామి నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కనులు తెరిచినా కనులు మూసినా’. కిరణ్ పర్వతనేని సహా నిర్మాత.
తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చాలా క్యురియాసిటీని పెంచింది. ప్రేమ, నమ్మకం, స్వార్థం, మోసం, కుట్రల మధ్య జరిగిన ఆటలో చివరికి ఏమైయిందనేది చాలా ఆసక్తికరంగా చుపించారు. సాయి రోనక్, దేవిక మిగతా నటీనటులు చక్కని నటన కనబరిచారు.
నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. దాము నర్రావుల కెమరాపనితనం ఆకట్టుకుంది. గౌర హరి అందించిన నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి శశాంక్ మాలి ఎడిటర్.
తారాగణం: సాయి రోనక్, దేవిక సతీష్, అర్జున్ ఆనంద్, ఉషా శ్రీ, అభిలాష్ బండారి, అనీష్ కురువిల్లా, సంజయ్ రెడ్డి, సుచిత్ర ఆనందన్
దర్శకత్వం: సందీప్ రెడ్డి KT
నిర్మాత: శాఖమూరి నారాయణ స్వామి
సహ నిర్మాత: కిరణ్ పర్వతనేని
బ్యానర్: ఫ్లయింగ్ ఈగిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: గౌర హరి
DOP: దాము నర్రావుల
ఎడిటర్: శశాంక్ మాలి
రచయితలు: మహేష్ Sk, బాలాజీ ప్రసాద్, శ్రీకాంత్ రాజ్ బిట్లింగ్
సింగర్స్ కపిల్ కపిలన్, యాజిన్ నిజార్, గౌరా హరి
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, భాస్కరభట్ల రవి కుమార్
కొరియోగ్రాఫర్: JD
పీఆర్వో: వంశీ -శేఖర్