Laggam Movie: రమేశ్ చెప్పాల దర్శకత్వంలో సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లగ్గం. మంచి కుటుంబ కథా! చిత్రంగా పెళ్లి నేపథ్యంలో దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైన లగ్గం చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రంతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు,ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, రోహిణి , ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ: లగ్గం చిత్రం జెన్యూన్ హిట్. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ ని రెండు రోజుల నుంచి గమనిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తాన్ని తన సోదరుడు లాంటి దర్శకుడు రమేష్ చెప్పాలకి ఇస్తాను.” అన్నారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ ఇంజనీర్ అల్లుడుగా కావాలని కోరుకోవడం అనేది సమకాలీన సమస్య! ప్రజెంట్ జనరేషన్ ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్ని ఆదరిస్తున్నారు” అని తెలిపారు. మీడియా మిత్రులు,క్రిటిక్స్ అంతా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి _మంచి ఫీల్ గుడ్ మూవీ’ అని చెబుతుంటే సంతోషంగా ఉంది.” అని రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు.
Laggam Movie Review: ‘లగ్గం’ మూవీ రివ్యూ & రేటింగ్…
దర్శకుడు రమేశ్ చెప్పాల మాట్లాడుతూ: లగ్గం చిత్రం కోసం తాను తొమ్మిది నెలల పాటు ప్రతి రోజు పద్దెనిమిది గంటలు కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో నాకు ఎంతో మద్దతుగా నిలిచిన చిత్ర యూనిట్, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంది. అంటున్నారు ప్రేక్షక దేవుళ్లకు నా కృతజ్ఞతలు.
నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ: “లగ్గం సినిమాకు వస్తోన్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎలాంటి అశ్లీలత లేకుండా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమాగా లగ్గం ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నటీనటులకు ముఖ్యంగా డైరెక్టర్ రమేష్ చెప్పాల గారికి అభినందనలు.. ఒక మంచి సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి, లగ్గం సినిమాను ప్రతి ఫ్యామిలీ తప్పకుండా చూడాలి, ఎమోషన్స్, బంధాలు, అనుబంధాలు ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగిందని” అన్నారు.
హీరో సాయిరోనక్ మాట్లాడుతూ: “ఈ లగ్గం చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్ లో ఇది ఫస్ట్ మైల్ స్టోన్ మూవీ. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేశ్ చెప్పాల నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రచ్చ రవి కృష్ణుడు కిరీటి మాణిక్ రెడ్డి చరణ అర్జున్, బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంధ్య గంధం, వీవారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ చిత్రం విజయోత్సవ వేడుక లగ్గంలాగే ఘనంగా జరిగింది.
ఈ చిత్రానికి కథ – మాటలు – స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి, నేపధ్య సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: బాల్ రెడ్డి. సంగీతం:చరణ్ అర్జున్. ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి. కొరియోగ్రఫీ: అజయ్ శివశంకర్.