టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిటర్ కు ఇదేమి రోగం

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆప్ ఇండియా, హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కెఆర్ శ్రీనివాస్ కు సెక్స్ వేధింపుల దెబ్బ సోకింది. ఇతగాడి ఆబచూపుల గురించి, అసహ్య కరమయిన సైగల గురించి, రెండర్థాల ఎస్సెమ్మెస్ ల గురించి, రోత పుట్టించే డ్యాన్స్ ల గురించి  ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఏడుగురు మహిళా ఉద్యోగులు ట్విట్టరెక్కి గోల చేశారు. దీనితో టైమ్స్ యాజమాన్యం సెలవు మీద పంపింది.

కెఆర్ శ్రీనివాస్  ఒక ఏడాది కిందట గోవానుంచి హైదరాబాద్ కు బదిలీ అయ్యాడు. అంతకు ముందు టైమ్స్ గ్రూప్ లోనే బెంగుళూరు పని చేసే వాడు.  

అయితే, ఇతగాడు ఎక్కడ ఉన్నా మహిళలను వలలో వేసుకునేందుకు ప్రయత్నించే వాడు. తాను బాస్ కాబట్టి బాసిజం  చలాయించి వీళ్లని ఇరుకున పెట్టేవాడు. ఆయన కవ్పింపు లైంగికచర్యలకు కాదంటే వృత్తి పరంగా సమస్యలొచ్చేవి. ఈ విషయాలను కొంతమంది టైమ్స్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, శ్రీనివాస్ కు  పైస్థాయిలో అండ ఉంది కాబట్టి ఏ చర్యా తీసుకోలేదు. ఇపుడు ‘మి టూ ’ (Me Too) ఉద్యమం ఇండియాలో కూడా మొదలు కావడంతో చాలా రంగాలలో పనిచేసే మహిళలు తమ బాసుగాళ్లు చేసిన వెకిలిచేష్టల గురించి బహిరంగంగా చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. వీళ్లకి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్  మంచి అవకాశాన్నిచ్చాయి.  దీని వల్లే టైమ్స్ ఎడిటటర్ శ్రీనివాస్ పైత్యం గురించి బయటపడింది. ఇక పరువుపోతుందని టైమ్స్ యాజమాన్యం ఆయన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో శెలవు మీద పంపింది.

ఏడుగురు మహిళలు పక్కా అధారాాలతో (స్క్రీన్ షాట్స్, ఎనెక్జర్స్ ) టైమ్స్ ఆప్ ఇండియా మేనేజ్ మెంట్ కు హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ మీద ఫిర్యాదు చేశారు. మేనేజ్ మెంట్ లో తనకున్న పలుకుబడిని చూపి శ్రీనివాస్ మహిళలను ఎంత వేధించాడో,  ఆయన పవర్ కు భయపడి తాము ఎంత సతమతమయ్యామో వారు తమ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.  ఆయన కవ్వింపులు కాదన్నందుకు తమ ఎంతగా వేధించారు, వాటిని ఎదిరించిన  ఈ మహిళంతా పూసగు చ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడుగురి లో ఒకరైన సంధ్యా మెనాన్ మొదట ట్విట్టరెక్కి  మీ టూ ఉద్యమంలో చేరారు.

మరొక సంఘటన శ్రీనివాస్ గోోవాలో రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నపుడు జరిగింది. అక్కడ ఒకామెని  తరచూ బయటకు ఆలా షికారుకు పోదామని సతాయించే వాడు. ప్రతిసారి ఆమె తిరస్కరిస్తూ వచ్చింది.  తనని రెసిడెంట్ ఎడిటర్ ఎంతగా వేధిస్తున్నాడో ఆమె యాజమన్యానికి చాలా క్లియర్ గా చెప్పింది. దీని మీద ఫస్టు పోస్టు చాలా వివరమయిన కథనం ఇచ్చింది. 

“One time, he invited her to a party, and she agreed because other colleagues would be present. But he went on to dance suggestively and gyrated close to her suggestively by thrusting forward, making her uncomfortable. When he understood his advances were not welcome, he promptly isolated her professionally, ensuring her career got stuck in a rut,” అని టైమ్స్ మేనేజ్ మెంటుకు రాసిన ఫిర్యాదులో ఈ ఈ విషయాన్ని పేర్కొన్నారు.  

మరొక సంఘటనలో శతాబ్ది చక్రవరి అనే  ఒక సబ్ ఎడిటర్ కు   శ్రీనివాస్ సెక్స్ జోక్స్ , సెక్స్ సూచించే సమాచాారాన్ని పంపేవాడు. అంతేనా, కాదు, రాత్రి పొద్దుపోయాక ఫోన్ చేసి తానామె ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పేవాడు.

ఒక సారి ఆయన శుభకీర్తన అనే మహిళలతో ఫేస్ బుక్ లో ఏవో మాయమాటలు చెప్పి  స్నేహం చేశాడు. అయితే అక్కడి అగలేదు, తర్వా అసభ్యకరమయిన మెసేజ్ లను పంపడం మొదలుపెట్టాడు.

ఈ ఏడుగురు మహిళలు శ్రీనివాస్ ని ‘సీరియల్ ప్రిడేటర్ ’ గా వర్ణిస్తూ  ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించి మహిళా జర్నలిస్టులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇలాంటి పవర్ ఫుల్ వ్యక్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వూహించే వారీ పని చేశారు.

‘ఇతగాడు పదే పదే చేస్తున్న వికారపు చేష్టల వల్ల అతనితో పనిచేస్తున్న మహిళల మానసికారోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ వృత్తిని  ఎంచుకుని వచ్చిన మహిళా జర్నలిస్టుల  ఆశలు ఆశయాలకు ఇతని  వల్ల భంగం కలుగుతున్నది…ఈ ఫిర్యాదులో సంతకాలు చేసిన మహిళల ప్రయోజనాలే కాదు, అతనితో ఇపుడు పని చేస్తున్న, ముందు ముందు పని చేయబోతున్న మహిళల ప్రయోజనాలు తమ పిటిషన్ తో ముడివడి ఉన్నాయి,’అనివారు పేర్కొన్నారు.

(పీచర్ ఫోటోక్రెడిట్స్  Twitter)