AP: రెండు రోజుల భోజనం ఖర్చు 1.2 కోట్లు… సంపద సృష్టించడం ఇదే నా బాబు?

AP: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భోజన ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు చర్చనీయాంశంగా మారింది. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్‌కు రెండ్రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ భోజనాల సరఫరా చేశారు అయితే ఈ భోజనాల ఖర్చుకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సంచలనగా మారింది.. ఒకరోజు భోజనాల ఖర్చుకు ఏకంగా 60 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్, స్నాక్స్‌ కోసం చెల్లించినట్టు సమాచారం.

ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, కమిషనర్లు, పోలీస్ శాఖలో అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇక ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఇలా రెండు రోజులు పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ల కోసం ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారికి ఫుడ్ సరఫరా కోసం కోటి 20 లక్షలు ఖర్చు చేశారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. భోజనాల సరఫరా కాంట్రాక్టును విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ హోటల్‌కు అప్పగించడంతో 7 స్టార్‌ హోటల్‌ రేట్లకు మించి బిల్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

ఇలా భోజనాల కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేయడంతో పలువురు పూర్తిగా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ ఖర్చులన్నీ డిప్యూటీ సీఎం గారికి కనిపించలేదా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేసిన ఈయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరం సంపద సృష్టించడం అంటే ఇదే నా బాబు గారు అంటూ కూడా ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. పథకాల అమలుకు ఖజానా ఖాళీ అంటూ బాబు భజన మొదలుపెట్టారు మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.