టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి హరిహరవీరమల్లు. ఈ సినిమాకు మొదట టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడని తెలిసిందే. కాగా ఈ చిత్రానికి పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్ రైటర్‌గా ఫైనల్ చేశారు మేకర్స్. అయితే పలు కారణాల వల్ల అనూహ్యంగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రాగా.. ఏఎం జ్యోతికృష్ణ డైరెక్టర్‌గా మారాడు.
ఈ నేపథ్యంలో క్రిష్‌తోపాటే తాను కూడా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానన్నారు పాపులర్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా. ఓ ఇంటర్వ్యూలో సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. హరిహరవీరమల్లులో క్రిష్ ఉన్నంతవరకు నేను కూడా ఉన్నా. సినిమా నుంచి క్రిష్ బయటకు వచ్చిన తర్వాత ఆయనతోపాటు నేను కూడా వచ్చేశానన్నారు. హరిహరవీరమల్లు చాలా గొప్ప సబ్జెక్ట్ అని.. సినిమా ఎప్పుడెప్పుడు వస్తదా.. అని ఎదురుచూస్తున్నానన్నారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. పార్ట్ 1ను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.