చిన్న సినిమాల మధ్య గట్టి పోటీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు ఊహించని స్థాయిలో బ్లాక్ భాస్కర్ హిట్ సొంతం చేసుకుంటారు. ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి సక్సెస్ అందుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే మే నెలలో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు 2 మూవీ మాత్రమే కొంతవరకు పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. నందినిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే మూవీ కూడా పెద్దగా ఆడియన్స్ కి మెప్పించలేదు. ఇక మే ఆఖరి వారంలో 26న చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చిన్న సినిమాలు కావడం విశేషం. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సుమంత్ ప్రభాస్ హీరోగా మేము ఫేమస్ అనే మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

చాయ్ బిస్కెట్, లహరి మ్యూజిక్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించింది. సెలబ్రిటీ ప్రముఖులతో షార్ట్ వీడియోలు చేస్తూ ఈ చిత్రాన్ని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. నరేష్, పవిత్ర లోకేష్ లీడ్ రోల్ లో ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కి రెడీకి సిద్ధమైంది. నరేష్, పవిత్ర లోకేష్ కి సంబంధించిన నిజ జీవిత సంఘటనలతో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ మూవీని నరేష్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించడం విశేషం. ప్రస్తుతం నరేష్, పవిత్ర లోకేష్ కి సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ కావడంతో మళ్లీ పెళ్లి సినిమాకి కూడా కావాల్సినంత హైప్ వచ్చింది. నరేష్ అగస్త్య హీరోగా బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించిన మెన్ టూ మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. సమాజంలో మగవారి కష్టాలపై వస్తోన్న సినిమా కావడంతో మంచి ఫన్ జనరేట్ చేసే మూవీగా ఉండే ఛాన్స్ ఉంది.

ఈ మూడు చిత్రాలకి కొంత పోటీ ఉంది. ఇవి కాకుండా మలయాళం హిట్ మూవీని 2018 టైటిల్ తో బన్నీ వాస్ స్నేహితులు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా గెలుపు గీత దాటితే, గోవిందా భజ గోవిందా, హీరో అఫ్ ఇండియా లాంటి చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. వీటిలో ఏది ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.