మీటూ బ్యూటీ లాయ‌రూ కామంధుడే!

#మీటూ ఉద్య‌మం లో భాగంగా  బాలీవుడ్ న‌టి త‌నుశ్రీద‌త్తా బాలీవుడ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా నానా ప‌టేక‌ర్ పై లైంగిక దాడి చేసాడ‌ని పెద్ద ఎత్తున ఆరోపించింది. దీంతో నానా ప‌టేక‌ర్ ఆ ఆరోప‌ణ‌ల్ని ఖండించాడు.  ఆ త‌ర్వాత ఇరువురు ఒకరిపై ఒక‌రు కేసులు వేసుకుని పంచాయ‌తీని కోర్టుకు తీసుకెళ్లారు. అయితే ఈ కేసును వాధించ‌డానికి త‌న త‌రుపున నితిన్ స‌త్పుటే అనే లాయ‌ర్ ని త‌నూశ్రీ నియ‌మించుకుంది. అయితే నితిన్ కూడా కామాంధుడేన‌ని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.
 
నితిన్ పై ఓ లైంగిక కేసు న‌మోదైన  సంగ‌తి ఆల‌స్యంగా తెలిసింది. ఇటీవ‌లే నితిన్ పై ఓ మ‌హిళా లాయ‌ర్ కేసు న‌మోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసును రాజీ చేసేందుకు నితిన్ ని…ప్ర‌త్య‌ర్ధి మ‌హిళా లాయ‌ర్ క‌లిసిందిట‌. ఆ స‌మ‌యంలో త‌న ప‌ట్ల నితిన్ అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని స‌ద‌రు మ‌హిళా న్యాయ‌మూర్తి  కేసు వేసింది. త‌న‌ను ర‌క్షిస్తాడ‌ని ఓ లాయ‌ర్ ను నిమ‌మించుకుంటే వాడు కామ పిశాచ‌ని..వికృతి చేష్టాల‌తో అస‌భ్యంగా లాయ‌ర్ వృత్తికే అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆ మ‌హిళా లాయ‌ర్ కేసు  వేసింది. మ‌రి ఇప్పుడు నితిన్ విష‌యంలో త‌ను శ్రీ ఎలా స్పందిస్తో చూడాలి. ప్ర‌స్తుతం నితిన్ పేరు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త‌ను శ్రీ ఆ కామాంధుడిని ఎలా న‌మ్మింది?  నితిన్ త‌నూశ్రీ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేదా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. త‌నూశ్రీ కార‌ణంగానే దేశ వ్యాప్తంగా మీటూ ఉద్య‌మం మొద‌లైంది. ఎంతో మంది  బాధిత‌ హిళ‌ల‌ను త‌ను ఇచ్చిన ధైర్యంతో ముందుకొచ్చి పోరాటం చేయ‌డానికి సిద్ద‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.