ఆంధ్ర, తెలంగాణల్లో మోదీ మీద మోజు తగ్గిపోయింది… CSDS సర్వే

million dislikes for man ki beat modi twitter account hacked

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ లో బాగా అపఖ్యాతి పాలయ్యారు. అమాటకొస్తే తెలంగాణలో కూడా ఆయన పాపులారిటీ బాాాగా పడిపోయింది. ఇదే రాజకీయ పార్టీలు చెబుతున్న ఒపినీయన్ కాదు. ఒక లో తైన పరిశోధన తర్వాత తేలిన విషయం. న్యూఢిల్లీలోని  ప్రతిష్టాత్మకమయిన సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవెలపింగ్ సొసైటీస్ (సిఎస్ డిఎస్ ) చేసిన సర్వేలో  ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాపితంతా ప్రధాని మోదీ పాపులారి (ఖ్యాతి) బాగా పడిపోయింది. అయితే, అన్ని రాష్ట్రాలలలో ఒకే విధంగా లేదు.  కొన్ని చోట్ల ఆయన ప్రతిష్ట బాగా దిగజారిపోతే, మరికొన్ని చెక్కుచెదరకుండా ఉంది. అలాగే ఆయన పలుకుబడి పెరిగిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని CSDS డైరెక్టర్ సంజయ్ కుమార్ రాశారు.

సంజయ్ కుమార్ తమ సర్వే ఫలితాలను ‘ది హిందూ’ లో ఒక  వ్యాసం రాస్తూ వెల్లడించారు. ఈ సర్వేల ప్రకారం2014 నుంచి ఇప్పటి దాకా తీసుకుంటే ఆంధ్రలో మోదీ పలుకుబడి బాగా తగ్గిపోయింది. 2014లో సర్వే చేసిన వారిలో 56 శాతం మంది ప్రదాని పదవికి మోదీయే అర్హుడని భావించారు. ఇపుడిది దారుణంగా 20 శాతానికి పడిపోయిందని సంజయ్ కుమార్ రాశారు. తెలంగాణలో కూడామోదీ పాపులారిటీ ఇలాగే దెబ్బతినింది. 2014 లో ఆయన పాపులారిటీ33 శాతం ఉండింది.  మే 2018 నాటికి ఇది 17 శాతానికి పతనమయింది. అంటే, ఈ లెక్కన 2019 ఎన్నికల్లో బిజెపి ఏ పరిస్థిత ఎదుర్కోబోతున్నదో అర్థమవుతుంది.

తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. దక్షిణాన ఒక్క కర్నాటకలోనే మోదీ పాపులారిటీ చెక్కుచెదరలేదని సిఎస్ డిఎస్ సర్వేలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో కూాడా మోదీ పాపులారిటీ బాగా పడపోయిందని ఈ సంస్థలు సర్వేలు వెల్లడించాయి. 2017 ఏప్రిల్ లో 56 శాతం ఉన్న మోదీ పాపులారిటీ ఇపుడు 35 శాతానికి పడిపోయింది. చిత్రమేమిటంటే, ఇది 2014 ఏప్రిల్ -మే  లో లోక్ సభ ఎన్నికల ముందు కనిపించిన పాపులారిటీ కంటే బాగా తక్కువ.

మధ్య ప్రదేశ్,  ఛత్తీష్ గడ్ లలో ఆయన పాపులారిటీ బాగా పడిపోయింది. అది ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాల్లో  స్ఫష్టంగా  కనిపించింది. ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్ లలో కూడా మోదీ  మీద మోజు తగ్గింది. వీటన్నింటితో పోలిస్తే చాలా ఆందోళనకరమయిన పతనం (most alarming decline) ఆంధ్రప్రదేశ్ లో కనిపించిందని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

అయితే, అస్సాంలో మోదీ పాపులారిటీ 2018 పూర్వార్ధంలో తారాస్థాయికి చేరకుందని కూడా CSDS సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇపుడు తగ్గింది. 2014 నుంచి ఒదిషాలో మోదీ పాపులారిటీ బాాగా పెరిగింది. ఇక పశ్చిమ బెంగాల్ లో  మోదీ ప్రతిష్ట బాగా పెరగడమే కాదు,తృణమూల్ మమతా బెనర్జీకి  ప్రధాని ప్రత్యర్థి అయ్యారు. కాంగ్రెస్ ఎక్కడో మూలన మూడో స్థానంలో ఉండిపోయింది. బీహార్ లో కూడా మోదీ పాపులారిటీ  2014 నుంచి పెరుగుతూ ఉంది. 2014 లో 46 శాతం ఉన్న మోదీ పాపులారిటీ 2018 మే నాటికి 56 శాతానికి పెరిగింది. రాజస్థాన్ (ఈ మధ్య బిజెపి వోడిపోయిన రాష్ట్రం) తో పాటు ఢిల్లీ హర్యానా గుజరాత్ లో మోదీ పాపులారిటీ బాగానే ఉంది,   నాలుగున్నరేళ్లుగా నిలకడా ఉంది.

అందువల్ల మోదీ భవిష్యత్తు గురించి అంచనా వేయడం  అంత ఈజీ కాదని సంజయ్ కుమార్ అంటున్నారు. మిగతా చోట్ల ఏమోగాని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆకట్టు కోవడం బిజెపి చేత కావడమో లేదు. అద్వానీ రథయాత్రగాని, రామమందిర ఉద్యమం గాని,  మహానేత అటల్ బిహారీ వాజ్ పేయి గాని ఇక్కడ  బిజెపి ని నిలబెట్ట లేకపోయారు. చివరకు భారత దేశాన్ని మొత్తం బిజెపి పాలన కిందికి తెచ్చిన మోదీ కూడా తెలుగు నాట కమలం వికసించేలా చేయలేకపోయారు. మారాష్ట్రాలు,  మారాజకీయాలు, మానేతలు మాయిష్టం, అనే ధోరణి లో తెలుగు వాళ్లున్నారు. బిజెపిని దూరంగా పెడుతున్నారు.