కేటీయార్ ఎవరు.? కేసీయార్ కొడుకు కదా.? పెద్ద మొగోడు, నిరుద్యోగుల సమస్యపై ఏం చేయగలడు.? అని ఘాటుగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీయార్) మీద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన విమర్శలతో డ్యామేజీ బాగా ఎక్కువగానే జరిగింది.. రాజకీయంగా. షర్మిలపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇది కూడా ఓ రకంగా కలిసొచ్చే అంశమే.. షర్మిల పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడం.. అంటూ అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, ఇటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ మద్దతుదారులూ భావించారు.
కానీ, వైఎస్ షర్మిలకు రాజకీయంగా చాలా డ్యామేజీ కలిగించాయి ఈ వ్యాఖ్యలు. ఎవరూ షర్మిల వ్యాఖ్యల్ని హర్షించలేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని కేసీయార్ సెటైర్లు వేశారంటే.. అప్పటికే కేసీయార్ చాలా పెద్ద నాయకుడు. రాజకీయాల్ని ఔపోసన పట్టిన వ్యక్తి.
షర్మిల అలా కాదు. కొత్త రాజకీయాలు.. కొత్త తరాన్ని ఆకట్టుకునే ఆలోచనలు చేయాల్సింది పోయి.. పసలేని పాత రాజకీయాలు చేయడమేంటి.? ఏ పార్టీ మీద పోరాటం చేయాలనుకుంటున్నారు.? ఏ వ్యవస్థల మీద పోరాటం చేయాలనుకుంటున్నారు.? ఇదా పద్ధతి.? అన్న విమర్శల్ని షర్మిల ఎదుర్కొంటున్నారు. నిజానికి, తెలంగాణలో అత్యంత కీలకమైన సమస్యని షర్మిల అడ్రస్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఈ విషయంలో ఆమెకు మంచి మద్దతే లభించింది.
కానీ, దాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో తప్పటడుగు వేసేశారు. కేటీయార్ మీద సెటైర్లు వేయడం వల్ల షర్మిలకు కలిసొచ్చిందేమీ లేదు.. కోల్పోయిందే ఎక్కువ అని షర్మిల సన్నిహితులు కూడా భావిస్తున్నారట. కానీ, ఆమెకు ఈ విషయం అర్థమయ్యేలా ఎలా వివరించి చెప్పాలా.? అన్నదే వారి సందేహంగా కనిపిస్తోంది.