పాక్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే ఉగ్రవాద సంస్థ ట్రైనింగ్ సెంటర్ ను భారత వైమానికి దళాలు పేల్చేశాయి. ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న ఆయుధాల డంప్ ను కూడా భారత్ పేల్చేసింది. మిరేజ్ యుద్ధ విమానాలతో ఈ స్థావరాన్ని నేలమట్టం చేశారు. ఈ కేంద్రంలో సుమారు 200 ఏకే రైఫిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రైఫిళ్లను కూడా వాయుసేన ధ్వంసం చేసింది. ఇంటలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారమే ఈ దాడి జరిగిందని వైమానిక దళ నిపుణులు అంటున్నారు.
ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఇవాళ నిర్వహించిన ఈ దాడిలో కొందరు జైషే ఉగ్రవాదులను టార్గెట్ చేశారు. మౌలానా అమ్మార్(ఆఫ్ఘన్, కశ్మీర్‌లో ఆపరేషన్), మౌలానా తల్లా సైఫ్(మసూద్ అజర్ సోదరుడు), ముఫ్తీ అజర్ ఖాన్ కశ్మీర్(హెడ్ ఆఫ్ కశ్మీర్ ఆపరేషన్స్), ఇబ్రహీం అజర్(ఐసీ814 హైజాకర్)లు ఉన్నారు.
Key Jaish e Mohammed operatives targeted in today’s air strikes: Maulana Ammar(in pic 1, associated with Afghanistan and Kashmir ops) and Maulana Talha Saif(pic 2), brother of Maulana Masood Azhar and head of preparation wing pic.twitter.com/rkEyCqvMJg
— ANI (@ANI) February 26, 2019
Key Jaish e Mohammed terrorists targeted in today’s air strikes: Mufti Azhar Khan Kashmiri, head of Kashmir operations(pic 1) and Ibrahim Azhar(pic 2), the elder brother of Masood Azhar who was also involved in the IC-814 hijacking pic.twitter.com/IUv1njNygA
— ANI (@ANI) February 26, 2019