జనాలకు అంత జ్ఞానం లేదులే అనుకుంటారో.. లేక, అప్పటికి తప్పించుకోవడానికి అంతకుమించిన మార్గం లేదని భావిస్తారో తెలియదు కానీ… పాలకులకు ప్రజలు ఎదురై సరైన ప్రశ్న సంధిస్తే… అసత్యాలనే ఆయుధాలుగా నమ్ముకుని ముందుకు వెళ్తుంటారు కొందరు నేతలు. ఇందులో భాగంగా ఆ దిశగానే అడుగులువెసి నడుచుకున్నారు కేంద్రమంత్రి నిర్మళా సీతారామన్.
ప్రతిపక్షంలో ఉండగా గ్యాస్ సిలెండర్ ధర 5 – 10 రూపాయలు పెరిగే రోడ్డెక్కి ధర్నాలు దీక్షలూ చేసిన బీజేపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక అవిరామంగా ధరలు పెంచుకుంటూపోతున్నారు. అడిగినవారిపై మతం రంగో, కులం రంగో పులిమి సైడైపోతున్నారు. అయితే నేరుగా ప్రజలే ప్రశ్నిస్తే మాత్రం షాక్ తింటున్నారు. ఇందులో భాగంగా… కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తమిళనాడులో షాకిచ్చారు జనాలు.
“గ్యాస్ సిలిండర్ కొనలేకపోతున్నామమ్మా, మళ్లీ కట్టెలపొయ్యే దిక్కు అయ్యింది” అంటూ తమిళనాడు కాంచీపురం జిల్లాలోని మహిళలు నిర్మలా సీతారామన్ ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ఎంక్వయిరీ చేయాలనుకున్న ఆమెకు అవిరామంగా పెరుగుతూ గ్యాస్ సిలిండర్ల రేట్లపై ప్రశ్నల వర్షం ఎదురైంది. సామాన్యుల గురించి ఆలోచించని కేంద్రం తీరుపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
దీంతో… ముందుగా చెప్పుకున్నట్లే అసత్యాలను నమ్ముకుని అప్పటికి గట్టెక్కాలనుకున్న నిర్మళా సీతారామన్… వంటగ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని.. వంట గ్యాస్ ను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా ధరలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయన్నారు. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెంచాలన్నారు. నిర్మలమ్మ సమాధానంతో సంతృప్తి చెందని ఆ మహిళలు… మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అని ప్రశ్నను సంధించలేకపోయారు!
ఈ వివరణ ద్వారా నిర్మళా సీతారామన్ పచ్చి అబద్ధం చెప్పారు! ఎందుకంటే… అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగిన ప్రతిసరీ.. దానికి అనుగుణంగానో, ఇంకాస్త ఎక్కువగానో భారత్ లో ధరలు పెరిగాయి. కానీ.. అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఒక్కపైసా కూడా ఏనాడూ తగ్గింది లేదు! దీంతో… ఈ విషయం జనాలకు తెలియదులే నిర్మళ నమ్మకాన్ని, ఏమి చెప్పినా వెర్రి జనాలు నమ్ముతారన్న ఆమె ధైర్యాన్ని మాత్రం ఈ సందర్భంగా అభినందించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు!