విజ‌య‌న‌గ‌రానికీ కరోనా..కొంప ముంచిన వ‌ల‌స‌

క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వాలు ఎన్ని చేసినా మ‌హ‌మ్మారి వ్యాప్తి మాత్రం యధావిధిగా కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ర్టాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా…ఏపీలో మాత్రం ఇంకా పంజా విసురుతూనే ఉంది. జిల్లాల వారిగా రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవ‌లే శ్రీకాకుళంలో కూడా 5 పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌డంతో ఆ జిల్లాని మ‌హ‌మ్మారిని తాకింది.

తాజాగా క‌రోనా ర‌హిత జిల్లాగా ఉన్న విజ‌య‌న‌గ‌రానికి మ‌హమ్మారి సోకింది. అక్క‌డా మూడు పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇప్ప‌టివ‌ర‌కూ గ్రీన్ జోన్ లో ఉన్న విజ‌య‌న‌గ‌రంలో కొన్ని ఏరియాలు ఇప్పుడు రెడ్ జోన్ల‌గా మారిపోయాయి. ఇంకొన్నింటిని ఆరెంజ్ జోన్ల‌గా అవ‌త‌రించాయి. గుజ‌రాత్ నుంచి చింత‌ప‌ల్లి వ‌చ్చిన మ‌త్స కారుడు, నెల్లూరు నుంచి కొమ‌రాడ వ‌చ్చిన వ‌ల‌స కార్మికుడు, విజ‌య‌వాడ‌లోని పెద‌పార‌పాడు నుండి పిరిడి వ‌చ్చిన వ‌స‌ల కార్మికుడు తో మూడు కేసులుగా న‌మోద‌య్యాయి. ఇంకా చిల‌క‌ప‌ల్లిలోని ఓ మ‌హిళ‌కు కొవిడ్-19 పాజిటివ్ అన్న‌ అనుమానం వ్య‌క్తం అవుతోంది.

అప్ర‌మ‌త్త‌మైన అధికారులు మ‌రింత క‌ట్టడి దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఆ న‌లుగురు ఎవ‌రెవ‌ర్ని క‌లిసారు? ఏ మార్గాల ద్వారా స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్నారు? వ‌ంటి ఆరాలు తీస్తున్నారు. వివరాల‌ను బ‌ట్టి వాళ్ల‌తో చ‌నువుగా మెలిగిన వారంద‌ర్నీ క్వారంటైన్ల‌కు త‌ర‌లించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇదే రోజున విశాఖ‌లో గోపాల‌ప‌ట్నం ఫ‌రిదిలో గ్యాస్ విస్పోట‌నం జ‌ర‌గ‌డంతో అంబులెన్స్ ల సౌక‌ర్యం స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో త‌ర‌లింపుకు తాత్క‌లిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని స్థానికులు చెబుతున్నారు.