దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందా? వైద్య నిపుణులు ఏమంటున్నారంటే…

చైనాలో మూడు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన భయానక పరిస్థితులు మళ్లీ ఈ ఏడాది పునరావృతం అవుతుంటే ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం చైనాలో విలయతాండవం సృష్టిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ బీఎఫ్‌. 7 స్ట్రెయిన్‌ గనుక భారత్లో విజృంభిస్తే మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారా అనే సందేహాలు చాలామందిని కలవరపాడుకు గురి చేస్తున్నాయి.

లాక్ డౌన్ విధించే పరిస్థితి భారత దేశంలో తలెత్తకపోవచ్చునని చాలామంది వైద్య నిపుణులు చెబుతున్నారు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా మార్గదర్శకాలని ఇప్పటికే జారీ చేసింది.భారత్‌లో కరోనా ఇప్పుడు పూర్తిగా అదుపులోనే ఉందని, వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉంటే చాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో లాక్‌ డౌన్‌ పెట్టడంగానీ, అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడం లాంటి
చర్యలు భారత ప్రభుత్వం తీసుకోదు ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల ఎలాంటి ఫలితం లేదని ఇప్పటికే స్పష్టమైనది. మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

ఎయిమ్స్ వైద్య నిపుణులు సూచించిన దాని ప్రకారం భారతదేశంలో ఇప్పటికే 90% పైగా జనాభా రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు.దానికి తోడు దేశంలో చాలామందికి కరోనా సోకి కోలుకున్నారు. కరోనా సబ్ వేరియట్లను తట్టుకునే వ్యాధినిరోధక శక్తి ప్రజల్లో పెరిగి హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ ఉన్నందున చైనాలో తీవ్రంగా వ్యాపిస్తున్న బీఎఫ్‌-7 కొత్త వేరియంట్ మనదేశంలో తీవ్ర ప్రభావం చూపలేదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాలు కొన్ని నిబంధనలు విధించింది . మీలో తీవ్రమైన జలుబు, దగ్గు ,జ్వరం, తలనొప్పి , గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే మాస్కు ధరించడం భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సలహాలు తీసుకోవాలి.